19 నెలల కనిష్టానికి రూపాయి

 

ముంబై జూన్ 28 (globelmedianews.com)   
డాలర్‌తో రూపాయి విలువ బుధవారం ఉదయం 19 నెలల కనిష్టానికి పడిపోయింది. మంగ‌ళ‌వార‌మే డాల‌రుతో రూపాయి మార‌కం వారం క‌నిష్ట స్థాయిని న‌మోదు చేసింది.పెరుగుతున్న క్రూడాయిల్ ధరల ప్రభావం కారణంగా ద్రవ్యోల్భణం, ఆర్థిక లోటు పెరుగుతుందని ట్రేడర్స్ ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు. డాలర్‌తో పోల్చుకుంటే రూ.68.42 పైసలతో ప్రారంభమైంది. ఆ తర్వాత 68.50కి పడిపోయింది. ఇది దాదాపు రెండేళ్ల క్రితం అంటే 1 డిసెంబర్ 2016కు పడిపోయింది. అంతకుముందు రోజు కంటే 30 పైస‌లు పడిపోయింది. అంతకుముందు 67.99గా ఉంది. ఏడాది డేటా చూసుకుంటే 7 శాతం పడిపోయింది. మంగళవారం ఇంధన ధరలు పెరిగాయి.  రెండు రోజుల క్రితం ఆర్బీఐ.. డాలర్‌తో రూపాయి మారకం విలువను 68.1466గాను, యూరోతో 79.3499 గాను నిర్ణయించింది. 2018, జూన్ 22న ఈ మారకం రేట్లు 67.7695, 78.8566గా ఉండేవి. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది 19 నెలల కనిష్టానికి రూపాయి

No comments:
Write comments