జూలై 5న మూడు లక్షల సామూహిక గృహ ప్రవేశాలు

 

విజయవాడ, జూన్ 29, (globelmedianews.com)
చంద్రబాబు ప్రభుత్వం టాప్ గేర్ లో ఉంది... ఒక పక్క సంక్షేమం, ఒక పక్క డెవలప్మెంట్.. రెండూ బాలన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది... పేదలకు ఇల్లు కట్టిస్తున్నాం అని ప్రభుత్వాలు చెప్పటం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం... కాని అవన్నీ పేపర్ లోనే ఉంటాయి.. బయట కనిపించవ్... కాని చంద్రబాబు ఇల్లు లేని ప్రతి పేదవాడికి, ఇల్లు కాట్టిస్తున్నారు.. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన మూడు లక్షల ఇళ్లలో జులై 5న సామూహిక గృహ ప్రవేశాలు ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని బుధవారం మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
 
 
జూలై 5న మూడు లక్షల  సామూహిక గృహ ప్రవేశాలు
 
 రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ గృహ ప్రవేశాలుంటాయన్నారు.ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇంతవరకు నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా గత ఏడాది అక్టోబరులో లక్ష సామూహిక గృహప్రవేశాలు నిర్వహించామని, నాలుగేళ్లలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద మొత్తం 5.61 లక్షల ఇళ్లను నిర్మించామని మంత్రి తెలిపారు. ఒక్కపైసా అవినీతికి తావులేకుండా ఒకే రోజు లక్ష నూతన గృహాల ప్రారంభోత్సవం చరిత్రాత్మకమైనదని మంత్రి అన్నారు. ఎవరైనా సరే మంజూరులో కానీ, బిల్లు ఇచ్చే సందర్భంలో లంచం అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలా ఎక్కడైనా జరిగితే 1100 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తమ దృష్టికి తేవాలని కోరారు.ఈ ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా సాగుతుంది. ఎక్కడా రూపాయి అవినీతికు తావు ఉండదు. మొత్తం డబ్బులు బ్యాంకు ఎకౌంటు లో పడతాయి. అంతే కాదు, మొత్తం ప్రక్రియ అంతా, ప్రతి స్టేజ్ రియల్ టైం లో ఆన్లైన్ లో ఉంటుంది.

No comments:
Write comments