గూగుల్ లో తెలుగు యాడ్ సెన్స్

 

ముంబై జూన్ 28 (globelmedianews.com)   
తెలుగులో బ్లాగ్ లేదా వెబ్‌సైట్‌ను రన్ చేస్తున్న వారికి గూగుల్ శుభవార్త చెప్పింది. గూగుల్ యాడ్‌సెన్స్ సపోర్ట్‌ను ఇకపై తెలుగు వెబ్‌సైట్లకు కూడా అందిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. హైదరాబాద్‌లో ఇవాళ జరిగిన ఓ సదస్సులో గూగుల్ ప్రతినిధి ఒకరు ఈ వివరాలను వెల్లడించారు. గూగుల్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ సదస్సులో మాట్లాడుతూ.. గూగుల్ యాడ్‌సెన్స్ సపోర్ట్‌ను ఇకపై తెలుగు బ్లాగ్‌లు, వెబ్‌సైట్లకు కూడా అందిస్తున్నామని తెలిపారు. దీని వల్ల తెలుగులో వెబ్‌సైట్లను రన్ చేసే వారు యాడ్‌సెన్స్ అకౌంట్‌కు సైనప్ అయి అకౌంట్‌ను పొందవచ్చని, దీంతో తమ వెబ్‌సైట్ల ద్వారా వారు ఆదాయాన్ని ఆర్జించవచ్చని అన్నారు. మరోవైపు తమ ఇంకొక ప్రొడక్ట్ అయిన యాడ్ వర్డ్స్‌కు కూడా తెలుగులో సపోర్ట్‌ను అందిస్తున్నామని అన్నారు.
 
 
 
గూగుల్ లో తెలుగు యాడ్ సెన్స్ 
 
 దీని వల్ల అడ్వర్టయిజర్లు ప్రాంతీయ వినియోగదారులకు మరింత చేరువై తమ వ్యాపార కార్యకలాపాలను విస్తృతం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, కొత్త అవకాశాలకు ఇది ఊతం ఇస్తుందని తెలిపారు. కాగా ప్ర‌స్తుతం తెలుగుతో క‌లిపి మొత్తం నాలుగు భార‌తీయ భాష‌ల‌కు గూగుల్ యాడ్‌సెన్స్‌, యాడ్ వ‌ర్డ్స్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. హిందీ, బెంగాలీ, త‌మిళం, తెలుగులలో వెబ్‌సైట్ ఓన‌ర్లు యాడ్‌సెన్స్ అకౌంట్ల‌ను సాధించ‌వ‌చ్చు. అలాగే అడ్వ‌ర్ట‌యిజ‌ర్లు ఆయా భాష‌ల్లో యాడ్స్‌ను ఇచ్చుకోవ‌చ్చు. ఇప్పటి వరకు గూగుల్ యాడ్‌సెన్స్‌కు తెలుగు సపోర్ట్ లేదు. అందువల్ల చాలా మంది అందులో అనేక రకాలైన విధాలుగా గూగుల్ యాడ్‌సెన్స్ యాడ్స్‌ను పెట్టి నెట్టుకొచ్చారు. అయితే ఇకపై ఆ అవకాశం లేదు. నేరుగా సపోర్ట్‌ను అందిస్తున్నారు కనుక ఇకపై ఏ తంటా లేకుండానే గూగుల్ యాడ్‌సెన్స్ యాడ్స్‌ను వెబ్‌సైట్ల ఓనర్లు తమ సైట్లలో పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడే అసలు తమాషా ఉంది. కొందరు వెబ్‌సైట్ల ఓనర్లు ఇప్పటి వరకు గూగుల్ యాడ్‌సెన్స్‌కు తెలుగు సపోర్ట్ లేనందున కాపీ రైట్ ఫిర్యాదు చేసేందుకు ఎలాగూ వీలుండదు కనుక యథేచ్ఛగా ప్రముఖ సైట్ల నుంచి కంటెంట్‌ను మక్కికి మక్కి కాపీ చేసి తమ సైట్లలో పెట్టుకునే వారు. కానీ ఇప్పుడు అధికారికంగా తెలుగు భాషకు యాడ్‌సెన్స్ సపోర్ట్ ఇచ్చారు. కనుక ఇకపై సైట్లలో కంటెంట్‌ను కాపీ చేయడం కుదరదు. లేదూ.. చేస్తామంటే సైట్ల ఓనర్లు కాపీ రైట్ వేయవచ్చు. దీంతో కంటెంట్‌ను కాపీ చేసే సైట్లకు యాడ్‌సెన్స్ రద్దు అవుతుంది. కనుక ఇకపై తెలుగు సైట్లలో కంటెంట్‌ను కాపీ చేసే వారు ఆ పనిచేసేముందు కొంత ఆలోచిస్తే మంచిది. లేదంటే వెబ్‌సైట్‌కు అనసవరంగా యాడ్‌సెన్స్ యాడ్స్‌ను కోల్పోవాల్సి వస్తుంది

No comments:
Write comments