రైతు కూలీలను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

 

వరంగల్,  జూన్30, (globelmedianews.com)
వరంగల్ రూరల్ జిల్లా, పర్వతగిరి మండలం, రావురు గ్రామం వద్ద చెలుకలో పని చేస్తున్న  వ్యవసాయ కూలీలు, రైతులను చూసి మార్గం మధ్యలో వాహనం ఆపి వారితో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు వ్యవసాయ రైతులు, కూలీలకు అందుతున్నాయా అని ఆరా తీసి, వివరాలు అడిగారు. వ్యవసాయ రైతు గుగులోత్ కిషన్ ను రైతు బంధు, కరెంట్ సరఫరా మంచిగా ఉందా అని అడిగారు. తనకు 3 ఎకరాల 16 గుంటలు భూమి ఉందని, రైతు బంధు కింద 13 వేల రూపాయలు నగదు వచ్చిందని కిషన్ తెలిపారు.  కరెంట్ సమస్య పోయిందన్నారు. గతంలో చాలా ఇబ్బంది ఉండేనని ఇప్పుడు అలాంటి బాధ లేదన్నారు.  పిల్లలు ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన పిల్లలు ఒకరు బి.టెక్, ఒకరు ఇంటర్ చదువుతున్నారని చెప్పారు.  ప్రభుత్వ పథకాలు కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ల సరిగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.  తమ తండాలో కొంతమందికి పట్టాలు రాలేదు, ఇప్పించాలని  కిషన్ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ని కోరారు.  సాదా బైనామాల పట్టాలు కాబట్టి మొదటి విడతలో రాలేదని, ఇప్పుడు తప్పకుండా వస్తాయని హామీ ఇచ్చారు. వ్యవసాయ కూలీల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కూలి సరిగా అందుతుందా?, ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయా? అని అడిగారు. దానికి వారు సంతోషంతో మాకు పని దొరుకుతుంది, పథకాలు కూడా అందుతున్నాయని సమాధానం ఇచ్చారు. అనంతరం వారు తెచ్చుకున్న అన్నం బాక్స్ లు  ఉప ముఖ్యమంత్రి కడియం తెరిచి చూసి అందులోని వంకాయ టమాట కూర చూసి, ఈ కూర అంటే తనకి ఇష్టమని చెప్పారు. రైతు కూలీలను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

No comments:
Write comments