భరత్ అను నేనులో మళ్లీ రైతు సైన్లు

 

హైద్రాబాద్, జూన్ 29, (globelmedianews.com)
మహేష్ బాబు – కొరటాల శివ సినిమా ’‘భరత్ అనే నేను’లో యంగ్ సీఎం గా మహేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా లో ట్రాఫిక్ సమస్యలను, గ్రామాల్లో డాక్టర్లు లేక ఇబ్బందులు పడే వారి సమస్యలను కొరటాల అద్భుతంగా చూపించారు. అయితే భరత్ అనే నేను సినిమా లో రైతుల గురించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. రైతు సమస్యలను సీఎం డైరెక్ట్ గా వినడం… వాటిని పరిష్కరించేందుకు గాను మహేష్ ప్లానింగ్ కూడా ఉంది. కానీ సినిమా నిడివి పెరిగిపోయినందున రైతు సమస్యల సన్నివేశాలని తీసేసారు. కానీ సినిమా విడుదలై సక్సెస్ అయ్యాక ఆ సీన్స్ ని మళ్లీ యూట్యూబ్ లో విడుదల చెయ్యగా.. విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.అయితే మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమాలో కూడా పూర్తిస్థాయిలో తెలుగు రాష్ట్రాల్లోని రైతుల సమస్యలను, వారు అనుభవిస్తున్న కష్టాల గురించి మాట్లాడతాడని తెలుస్తోంది. అలాగే రైతుల రుణాలు, రుణమాఫీ గురించి, వాళ్ల పేదరికంలో ఉన్న పరిస్థితులను ప్రధానంగా సినిమాలో ప్రస్తావించడం జరుగుతుందని… ఇక వారి బాధలకు, వారి కష్టాలకు పరిష్కారం చూపించడమే కాకుండా… రైతుల్లో కొత్త ఉత్తేజం నింపే తరహాలో ఈ సినిమా కథ ఉండబోతుంది అంటూ ఒక తరహా న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
భరత్ అను నేనులో మళ్లీ రైతు సైన్లు

No comments:
Write comments