రోజు 2 లక్షల మందికి అన్న క్యాంటిన్లలో భోజనాలు

 

విజయవాడ, జూలై 12 (globelmedianews.com)
రాష్ట్రవ్యాప్తంగా పేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించాలన్న లక్ష్యంతో 'అన్న క్యాంటీన్లు' బుధవారం  ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని విద్యాధరపురంలోని 'అన్న క్యాంటీన్‌'ను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీపడకుండా పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని తెలిపారు. పేదలకు పట్టెడన్నం పెట్టే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలందరికి నాణ్యమైన ఆహారాన్ని కేవలం రూ.5కే అందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. క్యాంటీన్లను చక్కగా ఉంచాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అక్కడి మహిళలతో కలిసి క్యాంటీన్‌లో భోజనం చేసిన చంద్రబాబు.. క్యాంటీన్‌లోని ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ ద్వారా ఫీడ్‌బ్యాక్‌ నమోదు చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 25 మున్సిపాలిటీల పరిధిలో 60 అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి.

రోజు 2 లక్షల మందికి అన్న క్యాంటిన్లలో భోజనాలు
 త్వరలోనే మరో 203 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడుపూటలా కలిపి రూ.73లు ఖర్చయ్యే ఆహారాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.15కే లభ్యంకానుంది. ప్రతీ రోజు అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఒక్కో వ్యక్తికి గరిష్ఠంగా రెండు టోకెన్ల వరకు జారీచేసే అవకాశం ఉంది. ఆహార సరఫరా బాధ్యత 'అక్షయపాత్ర' సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. రోజూ రెండున్నర లక్షల మందికి ఆహారం అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది పేద, మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరకు మూడు పూటలా ఆహారాన్ని అందించే లక్ష్యంతో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.విజయవాడ విద్యాధరపురం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు అనంతరం పేదలతో కలిసి భోజనం చేశారు. మూడుపూటలా కలిపి రూ.73లు ఖర్చయ్యే ఆహారం ఈ క్యాంటీన్ల ద్వారా రూ.15కే అందుకోవచ్చు. ఇందుకు సంబంధించిన క్యాటరింగ్‌ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థ నిర్వహిస్తోంది. ప్రతి క్యాంటీన్‌లో రోజుకు 250-300 మందికి ఆహారం అందనుంది.

No comments:
Write comments