తెరపైకి రానున్న ధోని 2.0

 

న్యూఢిల్లీ, జూలై 6, (globelmedianews.com)
ఎం.ఎస్.ధోని ది అన్ టోల్డ్ స్టోరీ  గత 10 ఏళ్లలో బాలివుడ్ వచ్చిన బయోపిక్స్ లో మంచి విజయం సాధించిన సినిమా. స్టార్ హీరోలు నటించే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దీటుగా ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ధోని మీద జనాల్లో ఉన్న అభిమానం ఎలాంటిదో ఈ సినిమా రుజువు చేసింది. ఇప్పుడు ధోని సీక్వెల్ వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.ధోని కథను నీరజ్ పాండే చాలా హృద్యంగా తెరకెక్కిస్తే.. సుశాంత్ రాజ్ పుత్ ఆ పాత్రను అద్భుత రీతిలో పోషించి మెప్పించాడు. ఐతే ఇప్పటి వరకు వచ్చిన బయోపిక్స్ లో ఏదీ రెండు భాగాలుగా రాలేదు. ఇక దానికి . 

తెరపైకి రానున్న ధోని 2.0
కానీ ధోని సినిమాను మాత్రం కొనసాగించబోతున్నారట. దీనికి సీక్వెల్ కూడా రాబోతోందట. ధోని 2.0 పేరుతో కొత్త సినిమా చేయబోతున్నట్లు హీరో సుశాంత్ సింగ్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఎం.ఎస్.ధోని లో మహి చిన్నతనం నుంచి అతను 2011 ప్రపంచకప్ లో భారత్ ను విజేతగా నిలబెట్టే వరకు అంతా చూపించారు. దాదాపుగా అతడి జీవితంలోని కీలక ఘట్టాలన్నీ, చీకటి కోణాలన్నీ అందులో వచ్చేశాయి. 2011 ప్రపంచకప్ గెలవడం వంటి అంశాలతో బయోపిక్ ముగించాడు దర్శకుడు నీరజ్ పాండే. దాని తర్వాత ధోని కెరీర్ మామూలుగానే సాగింది. మధ్యలో ఆటతీరుపై విమర్శలు రావడం, టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వడం తప్ప ఇంకే విశేషం ఏమీ లేదు. అతడింకా వన్డేలు.. టీ20ల్లో కొనసాగుతూనే ఉన్నాడువ్యక్తిగత జీవితానికి సంబంధించి అంతా సాఫీగా సాగిపోతుంది. అలాంటపుడు ధోని 2.0లో చూపించడానికి ఏముందన్నది సందేహం. ఇప్పుడీ సీక్వెల్ ప్రకటించడం చూస్తే.. తొలి భాగానికి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం లాగే కనిపిస్తోంది. మరి అసలు ఇది ధోని లైఫ్ లో భాగామేనా లేక మరేదైనా ట్విస్ట్ ఇస్తారా? అనే విషయాలు తెలియాలంటే మళ్లీ ఆ చిత్ర టీం నుండి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

No comments:
Write comments