వారసులకు 2019 పరీక్షే

 

హైద్రాబాద్, జూలై 13 (globelmedianews.com) 
 ఏపీ, తెలంగాణాల్లో సీనియ‌ర్ నేత‌లంతా వృద్ధాప్యానికి వ‌చ్చేశారు. వారిలో ఇద్ద‌రు చంద్రులూ ఉండ‌టం కూడా విశేష‌మే. అబ్బే. అర‌వైకే అనేయ‌వ‌చ్చు. కానీ.. 2024 వ‌ర‌కూ వ‌దిలేస్తే.. కొడుకుల రాజ‌కీయ వార‌స‌త్వం అంద‌వ‌చ్చు.. అంద‌ని ద్రాక్షగా మిగిలిపోనూ వ‌చ్చ‌నే చింతే చంద్రుల‌ను కొడుకులకు ఇప్ప‌టికిప్పుడే వార‌స‌త్వం క‌ట్ట‌బెట్టాల‌నేందుకు మూల కార‌ణం. అయితే ఇక్క‌డ మ‌రో చిక్కు కూడా ఉంది. అదెలా అంటారా.. కేటీఆర్‌, లోకేష్ ఇద్ద‌రూ విదేశాల్లో మంచి చ‌దువులు చ‌దివారు. కొలువులు చేప‌ట్టారు. ఆ త‌రువాత రాజ‌కీయ ఓన‌మాల‌తో కేటీఆర్ ప్ర‌జాక్షేత్రంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. లోకేష్ మాత్రం ఎమ్మెల్సీ ప‌ద‌వితో అమాత్య‌ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. కేటీఆర్ అంత‌టి ప‌రిణితి, మాట‌కారి త‌నం లోకేష్‌కు ఇంకా అల‌వ‌డ‌లేదు. వ‌య‌సులోనూ చిన‌బాబే కావ‌టం కూడా మ‌రో కార‌ణం. చిన‌బాబు రాగానే త‌న‌కంటూ ఓ కోట‌రీను ఏర్ప‌ర‌చుకునే ప‌నిలో కొంత‌మేర స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. పైగా.. ఒకింత శ‌త్రువుల‌ను మూట‌గ‌ట్టుకున్నారు.
 
 
 
 వారసులకు 2019 పరీక్షే
 
 ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వంటి నాయ‌కుడు త‌మ‌తో క‌ల‌సి ఉండాల‌నే ఆలోచ‌న‌తో లోకేష్ ఆచితూచి విమ‌ర్శ‌లు చేయ‌టం కూడా ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం. ఇక‌పోతే కేటీఆర్ అయితే హ‌స్తం పార్టీను దుమ్మెత్తి పోస్తున్నారు. పైగా అమ్మ‌.. బొమ్మా అంటూ సోనియాగాంధీనే ఏకిపారేశారు.ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. ప‌వ‌ర్‌లో ఉన్నారు కాబ‌ట్టి ఏమ‌న్నా.. చెల్లుబాటు అవుతుంది. మ‌రి 2019లో ఏం చేస్తారు.. తండ్రుల వార‌స‌త్వాన్ని ఎలా నిలబెడ‌తార‌నేది వార‌సుల‌కు పెనుస‌వాల్ విసురుతోంది. ఈ జాబితాలో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కూడా వున్నా.. ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌లో ఉన్న నేత‌లు కావ‌ట‌మే వీరిపై మ‌రింత అంచ‌నాలు పెర‌గ‌టానికి కార‌ణం. కానీ.. చంద్రుల‌తో పోల్సితే.. వీరిద్ద‌రి రాజ‌కీయ అన‌భ‌వం చాలా స్వ‌ల్పం. పైగా రాజ‌కీయ ఉద్దండులు. చాణ‌క్యుల ఎత్తుల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌టం.. బావోద్వేగాల‌ను అదుపులో ఉంచుకుని ఆచితూచి స్పందించ‌టం కూడా వార‌సుల‌కు అబ్బ‌లేదు. పైగా.. వెన్నంటే ఉండి.. వెన్నుపోటు పొడిచే వారి గురించి వీరికి తెలియ‌ద‌నే చెప్పాలి. ఇక‌.. అభిమానుల‌ను ఓటుబ్యాంకుగా మ‌ల‌చుకోవ‌టం. పోలింగ్ బూత్ వ‌ర‌కూ తీసుకురావ‌టం.. అక్క‌డ బ్యాలెట్ వ‌ర‌కూ త‌మ‌ను గుర్తుంచుకునేలా ప్ర‌జ‌ల మ‌న‌సులో నాటుకోవ‌టం అనుకున్నంత ఈజీకాదు.. కానీ.. ఒక్క‌టి మాత్రం నిజం.. ఒక‌వేళ వార‌సులిద్ద‌రూ స‌క్సెస్ అయితే.. తండ్రుల‌కే ఖ్యాతి ద‌క్కుతుంది. అదే.. ఒక‌వేళ అటుఇటైతే.. కొడుకుల‌కే అప‌ఖ్యాతి  మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తుంది. ఎందుకంటే.. వీరు తండ్రుల‌కు త‌గిన త‌న‌యులు కాద‌నేది జ‌నం రుజువు చేశార‌నేది.. గెలుపోట‌ముల ద్వారానే ప్ర‌జ‌లు అంచ‌నా వేసుకుంటారు కాబ‌ట్టి. సో.. ఈ లెక్క‌న‌.. లోకేష్‌, కేటీఆర్‌. మ‌రోసారి జ‌గ‌న్ జ‌నం తీర్పును కాచుకోవాల్సిందే.

No comments:
Write comments