గ్రాఫిక్స్ హైలైట్ గా “అరుందతి అమావాస్య మూవీ జూలై 20న విడుదల

 

(globelmedianews.com)
కె వంశీధర్ సమర్పణ లో ప్రముక మోడల్ మిస్ కర్ణాటక అర్చన మోసాలి ముఖ్య పాత్రలో తోట కృష్ణ దర్సకత్వం లో శ్రీ కృష్ణ శంకర్ ప్రొడక్షన్స్ పతాకం పై కనమర్లపూడి కోటేశ్వర రావు నిర్మిస్తున్న చిత్రం “అరుందతి అమావాస్య” కె వింధ్యారాణి సహ నిర్మాత . ఈ నెల 20 న దాదాపు వంద ధియేటర్ లకు పైగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో  దర్శకులు తోట కృష్ణ ఈ చిత్ర వివరాలు తెలియజేస్తూ... అరుందతి కి అఘోరకు మధ్య జరిగే పోరాటం నేపధ్యం లో ఈ కథ సాగుతుంది ఈ చిత్రం లో  ఓ పాము ప్రధాన పాత్ర పోషిస్తుంది అమవాస్య రోజున ముగిసే ఈ పోరాటం లో ఎన్నో మలుపులు వుంటాయి అమ్మోరు అరుందతి చిత్రాల స్థాయిలో ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తాయి అత్యంత ఆసక్తికరం గా సాగే కథలో  ప్రేక్షకులకు నచ్చే కామెడీ ఎమోషనల్ అంశాలు ఈ చిత్రం లో ఉన్నాయి.
 
 
 
గ్రాఫిక్స్ హైలైట్ గా “అరుందతి అమావాస్య మూవీ జూలై 20న విడుదల
 
ఈ చిత్ర నిర్మాత కోటేశ్వర రావు మాట్లాడుతూ... సెన్సర్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీతో ఈ నెల 20 న విడుదలకు సిద్దంగా ఉంది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనేల దర్శకుడు ఈ చిత్రాన్ని అధ్బుతంగా తెరకెక్కించాడు అన్ని రకాల కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది ఇంకా ఈ చిత్రం లో బేబీ కీర్తన, షకీలా, నిహారిక, ఆర్ కె మామ మధుబాబు, శంకర్ దాదా మరియు ఈ చిత్ర నిర్మాత  కనమర్లపూడి కోటేశ్వర రావు ప్రధాన పాత్ర పోషించడం జరిగింది.
ఈ చిత్రానికి సంగీతం ఘనశ్యాం, మాటలు: సంతోష్ హర్ష వర్ధన్, చరణ్ యలమంద, స్క్రిప్ట్: సాయి నాథ్, ఫోటోగ్రఫి: ఎం ఎస్ గౌడ్, డి టి ఎస్ మిక్సింగ్: శ్రీ మిత్ర, పాటలు: బాబ్జి, వెంకన్న, నిర్మాత కనమర్లపూడి కోటేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మంచాల రమేష్ యాదవ్, కొ ప్రొడ్యూసర్ : కె వింధ్యారాణి,   కథ- స్క్రీన్ ప్లే -దర్శకత్వం: తోట కృష్ణ

No comments:
Write comments