జులై 27న "చి ల సౌ" సినిమా విడుదల!

 

(globelmedianews.com)
సుశాంత్ నటించిన 'చి ల సౌ' సినిమా జులై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారారు. రుహాని శర్మ హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. 
చి ల సౌ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, సిరుని సినీ కార్పొరేషన్ తో అనుబంధం ఏర్పరుచుకుంది. అన్నపూర్ణ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యనుంది. 
ఇటీవల విడుదలైన చి ల సౌ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు.
నటీనటులు:  సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, జయ ప్రకాష్, సంజయ్ స్వరూప్, రోహిణి, అను హాసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్.
 
 
 
జులై 27న "చి ల సౌ" సినిమా విడుదల!

No comments:
Write comments