నవంబర్ 29న 2.0

 

చెన్నై, జూలై 12 (globelmedianews.com)
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘2.0’ సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గతేడాది విడుదల కావల్సివున్నా.. వీఎఫ్‌ఎక్స్ గ్రాఫిక్స్ పనులు పూర్తికాకపోవడంతో వాయిదాపడుతూ వస్తోంది. దీంతో, ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియక రజనీకాంత్ ప్రేక్షకులు గందరగోళంలో ఉన్నారు. ఈ సినిమాకు విడుదలకు సంబంధించిన పలు తేదీలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. అయితే, వాటిని చిత్రయూనిట్ అధికారికంగా ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు శంకర్.. ఈ చిత్రం విడుదల తేదీని ట్విట్టర్ ద్వారా ప్రకటించి ఊహాగానాలకు తెరదించారు. ఎట్టకేలకు వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలు వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ డెలివరీ తేదీని ఖరారు చేశాయి. ఈ సందర్భంగా ‘2.0’ను ఈ ఏడాది నవంబర్‌ 29న విడుదల చేయనున్నాం’’ అని శంకర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రజనీ అభిమానుల్లో ఆనందం నింపింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ‘బాహుబలి’ సీరిస్ తరహాలో మరో సంచలనం సృష్టించనుందని ఇండియన్ ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. నవంబర్ 29న 2.0

No comments:
Write comments