కేంద్రం ఫై టిడిపి అవిస్వసానికి దిఎంకే మద్దతు... కనిమొళి

 

చెన్నై జూలై 17 (globelmedianews.com)
విభజన హామీలను సాధించడం కోసం పోరాడుతున్న టీడీపీకి తాము పూర్తి మద్దతు తెలుపుతున్నామని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. టీడీపీ ఎంపీలు ఈరోజు చెన్నైలో కనిమొళితో భేటీ అయ్యారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు... వాటిని నేరవేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆమెకు వివరించారు.రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నామని... డీఎంకే మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీడీపీ ఎంపీలు కోరుతున్నారని... వారికి తాము అండగా నిలుస్తామని చెప్పారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆమరణదీక్ష చేసినప్పుడు... దీక్షాస్థలికి కనిమొళి వచ్చి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.
 
 
 
కేంద్రం ఫై టిడిపి అవిస్వసానికి  దిఎంకే మద్దతు... కనిమొళి
 

No comments:
Write comments