కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో ముగిసిన మంత్రి హరీశ్ రావు భేటి

 

న్యూఢిల్లీ, జులై 10, (globelmedianews.com)
కేంద్ర మంత్రి గడ్కరీని మంత్రి హరీశ్‌రావు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, హైవేల నిర్మాణానికి సహకారంపై చర్చించారు. భీమా, నీల్వాయి, ర్యాలి వాగు, మత్తడి వాగు, కొమరం భీం ప్రాజెక్టులకు, కేంద్రం నుంచి మూడు నెలల కాలానికి దాదాపు  50-60 కోట్లు  రావాల్సి ఉందని హరీశ్‌రావు చెప్పారు. నిధులు విడుదల చేయాలని గడ్కరీ అధికారులను ఆదేశించారని హరీశ్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం కేటాయింపులో రాష్ట్రం నుంచి   కొత్తగా 7 జాతీయ రహదారులను ప్రకటించాలని కోరామని, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని హరీశ్‌రావు పేర్కొన్నారు.  సిద్దిపేట-ఎల్కతుర్తి,జనగామా-దుద్దెడ, మెదక్-ఎల్లారెడ్డి, పకీరా బాద్-బైంసా,  సిరిసిల్ల-కామారెడ్డి, వలిగొండ-తొర్రురూ, నిర్మల్-ఖానాపూర్ ఆర్థిక ప్రణాళికలో చేర్చి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కోరామని మంత్రి అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో ముగిసిన మంత్రి హరీశ్ రావు భేటి

No comments:
Write comments