జయశంకర్ జిల్లా నుంచే హరిత హారం

 

కరీంనగర్, జూలై 11, (globelmedianews.com)
 జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి సీఎం కేసీఆర్ నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.  సీఎం కేసీఆర్ నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మరో మూడు, నాలుగు రోజుల్లో జిల్లాకు వస్తారని సీఎంవో నుంచి సమాచారం అందింది. హరితహారం ప్రజా కార్యక్రమంగా నిర్వహించాలని, అన్నివర్గాల ప్రజలు, ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని, పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోనున్నారు. నాలుగో విడత హరితహారం కార్యక్రమం విజయవంతం కోసం అధికారులు రంగంలోకి దిగారు. సిరొంచ-ఆత్మకూరు 363 జాతీయ రహదారిలో రోడ్డుకు సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించటం మంచిదనే నిర్ణయానికి వచ్చా రు. 

జయశంకర్ జిల్లా నుంచే హరిత హారం
ఈ క్రమంలో జాతీయ రహదారిలో ఉన్న గణపురం మండ లం మైలారం గ్రామం వద్ద ఖాళీగా ఉన్న భూములు, రేగొండ మండలంలోని పాండవులగుట్టల ప్రదేశం నాలుగో విడత హరితహారం కార్యక్రమం నిర్వహణకు అనువైనదిగా భావించారు. అదేరోజు సాయంత్రం మైలారం గ్రామాన్ని సందర్శించి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. మైలారం, పాండవులగుట్ట సందర్శించి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం సీఎంవోకు సమాచారం ఇచ్చింది. సీఎం కేసీఆర్ మొక్కలు నాటి నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించటం, బహిరంగ సభలో పాల్గొననున్నందున ఇందుకు మైలారం, పాండవులగుట్ట అనువైన ప్రదేశాలు కావని అధికార యంత్రాంగం చివర కు మైలారం పక్కన ప్రధాన రహదారిలో ఉన్న గణపురం మం డలం గాంధీనగర్ గ్రామ శివారులోని రిజర్వ్ ఫారెస్టు స్థలాన్ని పరిశీలించింది. సీఎం మొక్కలు నాటి నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు, బహిరంగ సభ నిర్వహణకు గాంధీనగర్ అనువైనదిగా అధికారులు నిర్ణయించారు. నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో ఇక్కడ 10 నుంచి 15 వేల మొక్కలు నాటేందుకు అటవీశాఖ ప్రణాళిక తయారు చేసింది. ఈ రిజర్వ్ ఫారెస్టు స్థలంలో బ్లాక్ ప్లాంటేషన్లు నిర్వహించటానికి మొక్కలు నాట డం కోసం కందకాలను సిద్దం చేసింది. భూపాలపల్లి నుంచి పరకాల వైపు వెళ్తుండగా గాంధీనగర్ బస్‌స్టేజీ దాటగానే కుడివైపున ఉన్న కుంట అవతల వైపున ఈ రిజర్వ్ ఫారెస్టు స్థలం ఉంది. కుంట అవతల తాత్కాలిక హెలిప్యాడ్ నిర్మాణానికి అధికారులు సాయంత్రం ఏర్పాట్లు చేపట్టారు. సీఎం కేసీఆర్ మొక్కలు నాటి నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు స్థలాన్ని చదును చేస్తున్నారు. గాంధీనగర్ పక్కన జాతీయ రహదారిని ఆనుకుని బహిరంగ సభ నిర్వహణకు అధికారులు నిర్ణయించారు. వాహనాల పార్కింగ్‌కు, హరితహారం కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులు, సభకు తరలివచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండ సభా స్థలాన్ని గుర్తించారు. సెక్యూరిటీపరంగానూ ఈ స్థలం సేఫ్ అనే నిర్దారణకు వచ్చారు.సీఎం కేసీఆర్ పాల్గొనే నాలుగో విడత హరితహారం ప్రారంభ కార్యక్రమానికి 7,500 మంది విద్యార్థులు హాజరయ్యేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. హరితహారం ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలో దాదాపు 30 వేల మంది జనం పాల్గొంటారని అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది.

No comments:
Write comments