పట్టుకోసం హస్తం

 

కరీంనగర్, జూలై 6(globelmedianews.com)
ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముందస్తు ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆశావహులు టికెట్లు ఎలా సంపాదించాలనే దానిపై దృష్టి పెట్టారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ను ఢీకొనేందుకు సిద్ధమవుతోంది.. కరీంనగర్‌ నియోజకవర్గంలో ఆ పార్టీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.. గత ఎన్నికల్లో పోటీ చేసిన చల్మెడ లక్ష్మీనరసింహారావు సంవత్సర కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది... ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశానికి గైర్హాజరు కావడం ఈ వాదనకు బలమిస్తోంది.. మరికొందరు నాయకులు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నా గ్రూప్‌ తగాదాల కారణంగా వెనుకడుగు వేస్తున్నారు..
 
 
 
పట్టుకోసం హస్తం 
 
రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరిగిన పలు సందర్భాల్లోనూ కరీంనగర్‌ జిల్లా ముఖ్య భూమి కపోషిస్తూ రాజకీయ కేంద్రంగా నిలుస్తూ వస్తున్నది. అలాంటి కీలక జిల్లాలో కరీంనగర్‌ నియోజకవర్గంలో రాజకీయాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో గెలుపు సాధించి జిల్లారాజకీయాల్లో పైచేయిగా ఉండాలని అన్ని పార్టీలు భావిస్తుంటాయి. ఈసారి ఇలాంటి కీలక నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎవరన్నది స్పష్టత లేక రాజకీయ శూన్యతను ఎదుర్కొంటున్నది. గత ఎన్నికల్లో పోటీ చేసిన చల్మెడ లక్ష్మీనర్సింహారావు సంవత్సరకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చురుకుగా పర్యటించడంతోపాటు తనకు చెందిన చల్మెడ ఆనందరావు ఆసుపత్రి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సామాజిక కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేవారు. కొద్దికాలంగా ఆయన వీటన్నింటికి స్వస్తిచెప్పి దూరంగా ఉంటుండడం కాంగ్రె్‌సలోనే కాకుండా ఇటు ఇతర పార్టీల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
గత ఎన్నికల్లో లక్ష్మీనర్సింహారావుకు సంపూర్ణ మద్ధతు ప్రకటించిన ఆర్యవైశ్య సంఘం నేతలు కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎ్‌సలో చేరిన నేపథ్యంలో కూడా ఆయన వారిని ఆపే ప్రయత్నాలు చేయకపోవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఆయన టీఆర్‌ఎ్‌సలో చేరతారనే ప్రచారం కూడా ప్రారంభమయింది. ఇటీవల కేటీఆర్‌ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని లక్ష్మీనర్సింహారావుకు సంబంధించిన వసతిగృహంలోనే మకాం వేశారని, ఇది ఆయన టీఆర్‌ఎ్‌సలో చేరడానికి సిద్ధమయ్యారనడానికి సంకేతమని పలువురు చర్చించుకుంటున్నారు. వీటన్నింటిని లక్ష్మీనర్సింహారావు ఏ వేదికపైన ఖండించకపోవడం విశేషం. రెండు రోజుల క్రితం గాంధీ భవన్‌లో జరిగిన నియోజకవర్గాల బాధ్యుల సమావేశానికి కూడా లక్ష్మీనర్సింహారావు హాజరుకాకపోవడంతో ఆయన కాంగ్రె్‌సలో ఉంటారా, టీఆర్‌ఎ్‌సలో చేరతారా, అసలు పోటీలో ఉంటారా, ఉండరా అన్న చర్చ జోరుగా సాగుతున్నది.
లక్ష్మీనర్సింహారావు వ్యవహారం ఇలా ఉంటే ఆయన కాంగ్రె్‌సను వీడిన పక్షంలో అభ్యర్థి ఎవరన్న విషయంలో ఏ నేతకు స్పష్టత లేకుండా పోయింది. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, ఎమ్మెల్సీ టి సంతోష్‌ కుమార్‌, మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకటేశ్వర్‌, కె సత్యనారాయణగౌడ్‌, పీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద కరీంనగర్‌లోనే ఉంటూ కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమేనని చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో గ్రూపు రాజకీయాల కారణంగా ఒకరిని ఒకరు, ఒకరిని అందరూ వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువ. పార్టీలో ఉన్న నేతలందరూ తమ అనుకూల అంశాలను ప్రస్తావిస్తూ తనకే టికెట్‌ కావాలని అడిగే బదులు ఎదుటి వారి మైనస్‌ పాయింట్లనే తెరపైకి తెచ్చి వ్యతిరేకించడం కాంగ్రె్‌సలో కొన్నేళ్లుగా జరుగుతోంది. దీంతో అభ్యర్థులపై ఎవరికి ఏకాభిప్రాయం లేకుండా పోతున్నది. ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసే పొన్నం ప్రభాకర్‌ మదిలో ఏముందో ఎవరిని ఆఖరు క్షణంలో తెరపైకి తెచ్చి మద్దతు ఇస్తారో తెలియని పరిస్థితి ఉన్నదని పార్టీ నేతలు అంటున్నారు.
సీనియర్‌ నేతల పరిస్థితి ఇలా ఉండగా కొత్తగా కరీంనగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొత్త జైపాల్‌ రెడ్డి పేరు తెరపైకి వస్తున్నది. బీజేపీ నాయకుడిగా ఉన్న జైపాల్‌ రెడ్డి నాగం జనార్దన్‌రెడ్డి అనుచరుడిగా చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నాగం బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంతో జైపాల్‌ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతారని, నాగం జనార్ధన్‌ రెడ్డి తనతోపాటు తన సహచరులు కొందరికి టికెట్‌ ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌ అధినాయకత్వం నుంచి స్పష్టమైన హామీ పొందారని, అందులో జైపాల్‌ రెడ్డి కూడా ఉంటారని ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయంటున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరంచేసి అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ తమ శ్రేణులను ఉత్సాహపరుస్తుంటే కరీంనగర్‌లో మాత్రం కాంగ్రెస్‌ డీలా పడిపోవడం ఇప్పుడు అందరిని ఆలోచింపజేస్తున్న అంశంగా మారింది.

No comments:
Write comments