రైతు బీమాపై సీఎస్ సమీక్ష

 

హైదరాబాద్,  జూలై 24, (globelmedianews.com)
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బీమా పథకంలో ఇప్పటివరకు 26.38 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి  తెలిపారు.  మంగళవారం సచివాలయంలో  రైతు బీమా, బిందు సేద్యం, ల్యాండ్ రికార్డ్స్       అప్ డేషన్ ప్రోగ్రాం (ఎల్ ఆర్ యూపీ), కంటి వెలుగు, హరితహారం, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

రైతు బీమాపై సీఎస్ సమీక్ష
ఈ కార్యక్రమంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి ముఖ్యకార్యదర్శులు శాంతి కుమారి, పార్ధసారధి కార్యదర్శులు బి.వెంకటేశం, నవీన్ మిత్తల్, బెనహర్ మహేష్ దత్ ఎక్కా, అనితా రాజేంద్ర, పిసిసిఎఫ్ పి.కె.ఝా, సిసిఎల్ ఏ డైరెక్టర్ వాకటి కరుణ, హెచ్ఎండిఏ కమీషనర్ టి.చిరంజీవులు, నీతూ ప్రసాద్,  కమీషనర్ క్రిస్టినా చౌంగ్తు, సి.యం.ఓ. ఓ.ఎస్.డి (హరితహారం) ప్రియాంక వర్గీస్,వ్యవసాయ కమీషనర్ జగన్ మోహన్, ధరణి స్పెషల్ ఆఫీసర్ రజత్ కుమార్ షైని,  మరియు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి  పార్ధసారధి మాట్లాడుతూ రైతు బంధు చెక్కులు పొందిన రైతులందరిని, కాంటాక్ట్  చేయాలని అర్హులైన రైతులందరిని బీమా పథకంలో చేర్చాలని, ఈ విషయమై వెనుకబడిన జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. 48.26 లక్షల మంది రైతు బంధు చెక్కులు పొందారని ఇప్పటివరకు 40.64 లక్షలమందిని కాంటాక్ట్ చేశామని, అర్హులైన మిగతా వారిని సంప్రదించి వారి వివరాలను ఆగస్టు 1 నాటికి పంపాలని, ఎల్ ఐ సి వారికి సమర్పిస్తే ఐడి నెంబర్, సర్టిఫికేట్లు ముద్రిస్తారని అన్నారు. ఈ పథకంలో చేరడానికి ఇష్టం చూపని వారి వివరాలు నమోదు చేయాలన్నారు. ఆగస్టు 15 న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారు రైతులకు బీమా సర్టిఫికేట్లు అందిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల ద్వారా రైతులకు బీమా సర్టిఫికేట్లు అందించాలని అన్నారు. రైతులకు బిందు సేద్యం పథకం అమలు వేగవంతం చేయాలని నాబార్డ్ 874 కోట్ల రుణాన్ని అందించిందని, అక్టోబర్ నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ముఖ్యకార్యదర్శి  అన్నారు. కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేకంగా సమీక్షించాలని, రైతులకు ఈ పథకాన్ని వేగంగా అమలు చేయాడానికి క్షేత్ర స్ధాయిలో తనిఖీలు పూర్తి చేయాలని, ఫైల్స్ వేగంగా ఆమోదించాలని అన్నారు.
2016-17, 2017-18 సంవత్సరాలకు సంబంధించి 1,50,988 హెక్టారులో 1,38,179 రైతులకు లబ్ది చేకూరుస్తున్నామని, క్షేత్ర స్ధాయిలో  పూర్తి చేసి ప్రాజెక్టులను పూర్తిగా గ్రౌండ్ చేయాలన్నారు.
ల్యాండ్ రికార్డ్స్ అప్ డేషన్ ప్రోగ్రామ్ కు సంబంధించి, రెవెన్యూ ప్రత్యేక ప్రథాన కార్యదర్శి  రాజేశ్వర్ తివారి మాట్లాడుతూ 6 లక్షల డిజిటల్ సంతకాలు పూర్తిఅయ్యాయని ఇందులో 4.5 లక్షలు రాష్ట్ర స్ధాయిలో, 1.5లక్షలు మండల స్ధాయిలో పాసుపుస్తకాలు ప్రింటింగ్ చేయవలసి ఉందని, మండల స్ధాయిలో ప్రింటింగ్ ను వేగవంతం  చేయలన్నారు. రాష్ట్ర స్ధాయిలో ప్రింటింగ్ కు సంబంధించి ఇప్పటికే 2 లక్షలు ముద్రించామని వాటిని జిల్లాలకు పంపుతున్నామని, మిగిలిన 2.5 లక్షల పాసుపుస్తకాలను వారంలోగా ముద్రించి పంపిస్తామన్నారు. జిల్లాలలో ఇంకా మిగిలిన పాసుపుస్తకాల డిజిటల్ సంతకాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. గ్రామ స్ధాయిలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ కంటివెలుగు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గజ్వేల్ లో ఆగస్టు 15 న ప్రారంభిస్తారని ఇప్పటికే ఈ పథకం అమలుకై మార్గదర్శకాలను పంపామని, జిల్లా ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించుకొని నిర్వహంచాలన్నారు. జిల్లాలకు కళ్లజోళ్లు, ఎక్విప్ మెంట్ పంపామన్నారు. జిల్లా స్ధాయిలో మెడికల్ అధికారులు, ఆప్టి మెట్రీషియన్లతో టీం లుగా రూపొందించుకొని, గ్రామాల వారిగా పర్యటన షెడ్యూలు రూపొందించుకొని క్యాంపులను నిర్వహించాలన్నారు. జిల్లా స్ధాయిలో మెడికల్ ఆఫీసర్ల కొరత ఉంటే అవసరమైన డాక్టర్లను కాంట్రాక్టు పద్థతిలో తీసుకోవాలని ఆగస్టు 1 నాటికి వారు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.జిల్లా స్ధాయిలో మెడికల్ టీంలను బఫర్ లో ఉంచుకోవాలని అవసరమైన చోటుకి వారిని తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి నమోదు చేసుకోని ఆసుపత్రులు జిల్లాలలో ఉంటే వాటిని ఎంపానల్ మెంట్ కు చర్యలుతీసుకోవాలన్నారు.
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లపై బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం మాట్లాడుతూ మండల, రెవెన్యూ స్ధాయిలో తనిఖీలు పెండింగ్ లో ఉంటున్నాయని ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా సమీక్షించాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి పెళ్ళి నాటికి ఆర్ధిక సహాయం అందించాలనే ఆదేశాలను అమలు చేయడానికి కృషి చేయాలని నిధుల కొరత లేదని, మంజూరు పత్రాలను వేగంగా అందజేయాలన్నారు.

No comments:
Write comments