సింగపూర్ లో బాబు టూర్

 

విజయవాడ, జూలై 7 (globelmedianews.com)
అమరావతి అభివృద్ధిలో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది.. ఈ నెల 8, 9, 10 తేదీలలో ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొని అమరావతి అభివృద్ధి కి సంభంధించి పలు కీలక దైపాక్షిక ఒప్పందాలు చేసుకోనున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 8, 9, 10 తేదీల్లో ఆయన సింగపూర్‌లో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు సాగనున్న సింగపూర్‌ పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా సింగపూర్ లో జరిగే ప్రపంచ నగరాల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. వరుసగా మొదటి రెండు రోజులు ఆ సదస్సులో కొన్ని ముఖ్యమైన సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. పట్టణ, నగరీకరణకు సంబంధించిన అంశాలపై కీలక ప్రసంగాలు కూడా చేయనున్నారు. విదేశీ పర్యటనల మాదిరే వివిధ దేశాలకు చెందిన పలువురు వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. ఈ పర్యటనలో వివిధ దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధినేతలతో భేటీ కానున్నారు. ఇటీవల సింగపూర్‌ బృందం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆ దేశ కమ్యూనికేషన్ల మంత్రి ఈశ్వరన్‌ మేయర్ల సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రత్యేకంగా ఆహ్వానించిన.
 
 
 
సింగపూర్ లో బాబు టూర్ 

No comments:
Write comments