వరస సినిమాలతో జోరుమీదున్న శివాని రాజశేఖర్

 

హైద్రాబాద్, జూలై 26, (globelmedianews.com)
టాలివుడ్ లో ఇప్పుడు వారసురాళ్లు బాగా రాణిస్తున్నారు. మంచు లక్ష్మీ, కొణిదెల నిహారిక వరస సినిమాలతో దూసుకుపోతుండగా..తాజాగా రాజశేఖర్ డాటర్ శివాని కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. 2స్టేట్స్  తెలుగు మూవీలో నటిస్తున్న ఈ స్టార్ డాటర్ ప్రస్తుతం మరో క్రేజీ ఆఫర్ పట్టేసింది. ఆ విశేషాలు మీ కోసంటాలీవుడ్ హీరో రాజశేఖర్ కూతురు శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే అదరగొడుతోంది. ప్రస్తుతం ఈమె అడవి శేష్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘2స్టేట్స్’ రీమేక్ లో నటిస్తోంది. ఇటు తెలుగులో తొలి సినిమాకు సైన్ చేసి ఆ చిత్రం షూటింగ్ కంప్లీట్ కాకముందే.. తమిళంలో ఓ సినిమాకు ఒప్పుకొని బిజీ షెడ్యూల్స్ తో షూటింగ్ జరుపుకుంటుంది. అమ్మడి స్పీడ్ చూస్తుంటే  తెలుగు కంటే ముందు తమిళ్ తెరపై లాంచ్ అయ్యేలా కనిపిస్తోంది.విష్ణు విశాల్ హీరోగా వెంకటేశ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంతో శివానీ తమిళంలోకి ఎంట్రీ ఇస్తోంది. విష్ణు విశాల్ సొంత ప్రొడక్షన్ సంస్థ వీవీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముధురైలో ఫుల్ స్పీడుతో సాగుతోంది. ఇలా ఎంట్రీతో రెండు భాషల్లో హీరోయిన్ గా శివానీ మెరుస్తుండడం నిజంగా గొప్ప విషయమే. 
 
 

వరస సినిమాలతో జోరుమీదున్న శివాని రాజశేఖర్

No comments:
Write comments