గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామీకరణ: మంత్రి కేటీఆర్

 

రాజన్న సిరిసిల్ల,జూలై 17, (globelmedianews.com)
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం మండే పల్లి గ్రామంలో  రూ. 7కోట్ల 75 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఐ. టి. ఐ భవన సముదాయాన్ని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి కె తారక రామారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ  నీళ్లు, నియామకాలు, నిధులు ద్యేయంగా పని చేస్తున్నాం.  ఐటీ ఐ కళాశాల భవనం ను  ప్రారంభించడం సంతోషం గా ఉందని అన్నారు. బలహీన వర్గాల పిల్లలకు స్వయం ఉపాధి పథకాలు అందించడం కోసం కృషి చేస్తున్నాం. గ్రామీణ నియజకవర్గ ప్రాంతాల్లో  పారిశ్రామికరణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాలం తో పోటీ పడుతుంది.  గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం కోసం సీఎం కృషి చేస్తున్నారు. సిరిసిల్ల నియోజక వర్గంలో ప్రతి గ్రామం నుండి 100 మంది గల్ఫ్ వెళ్లిన వారే...అక్కడ చాల ఇబ్బందులు పడుతున్నారు.  గల్ఫ్ వెళ్లే వారి కోసం మేము ఇక్కడే మన రాష్ట్రంలో నే ఉపాధి కల్పిస్తామని అన్నారు.   సిరిసిల్ల అంటే గల్ఫ్ వలసలు ఎక్కువ.   టెక్స్ట్ టైల్ రంగానికి ఉపయోగ పడే ప్రత్యేక శిక్షణ ఐటీఐ కళశాల లో నెల కోల్పాలని  హోం మంత్రి ని కేటిఆర్ కోరారు.  మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో 46 వేళా చెరువులు నింపినం.  త్వరలోనే ఒక లక్ష 12 వేళా ఉద్యోగుల భర్తీ కోసం కృషి చేస్తామన్నారు. ప్రతి ప్రక్ష పార్టీలు నిరుద్యోగ భృతి అంటున్నారు...అసలు నిరుద్యోగులు అంటే ఎవరని ప్రశ్నించారు.  మా ప్రభుత్వం అన్ని రంగలను ఆదరించేసారికి ప్రతి ప్రక్ష పార్టీలు అయోమయంలో ఉన్నారని అయన వ్యాఖ్యానించారు. 

గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామీకరణ: మంత్రి కేటీఆర్
మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంది కాబట్టే విదేశాల నుండి పెట్టుబడులు పెడుతున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల వారిని ప్రభుత్వం ఆదరిస్తుందని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విదంగా సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కృషి చేస్తున్నారు. ప్రతి పక్షాలు మతి లేని మాటలు మాట్లాడుతున్నారు..60 ఏళ్ళు పరిపాలించి ఎం సాధించారు. బీజేపీ కి ఉన్నది 5 సీట్లు. కాంగ్రెస్ లెఅందరూ ముఖ్యమంత్రులే, వచ్చే ఎలక్షన్ లో ఒక్క స్థానం కూడా రాదని అన్నారు.  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు  టీఆరెస్ ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చే 15 ఏళ్ళు టీఆరె ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని అన్నారు.

No comments:
Write comments