టార్గెట్లు సమీక్షించుకోవాలి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

 

అమరావతి, జూలై 6, (globelmedianews.com)
గ్రామ దర్శిని పేర వచ్చే ఆరు నెలల్లో గ్రామాల్లో పర్యటించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం నాడు అయన సెక్రటరీలు, హెచ్ఒడిలు, కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇక పై ప్రతినెల రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ వుంటుందని అన్నారు౮౮ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శాఖల వారీ తీసుకున్న టార్గెట్లు సమీక్షించుకోవాలని అన్నారు. వచ్చే 6 నెలల్లో పాలనా వ్యవహారాలు, ప్రణాళిక , ఒడిఎఫ్, గ్రామదర్శిని, గ్రామీణాభివృద్ధి యాక్షన్ ప్లాన్, ఈ-ప్రగతిపై ఆయన చర్చించారు.
 
 
 
టార్గెట్లు సమీక్షించుకోవాలి  అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
 
 కొన్ని శాఖల్లో నాలుగేళ్ల కనిష్టానికి ఫలితాలు కనిపిస్తున్నాయని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై 16 నాటికి అధికారం చేపట్టి 1500 రోజులు పూర్తవుతాయని, ఈ కాలంలో పాలన, విజయాలపై ప్రచారం చేయనున్నామని ఆయన అన్నారు. గ్రామాల్లో పర్యటన సందర్భంగా ప్రజలకు ఏం చేశామో వివరిస్తూ వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో ప్రజలకు చెబుతామని ఆయన అన్నారు. అధికారులు ప్రజల మనసు గెలుచుకునేలా వ్యవహరించాలని ఆయన సూచించారు. అధికారులు, మంత్రులు మధ్య వివిధ శాఖలు పోటీతో పనిచేయాలి. సింగపూర్ కంటే గవర్నెన్స్ మనమే ముందున్నాం. జనవరిలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చామో, ఏమి చేశామో గ్రామాల వారీగా ప్రజల ముందుంచుతామని అయన అన్నారు. సాంకేతిక సమస్యలొచ్చాయని చెప్పకూడదు. పౌర సరఫరాలు,  వస్తువుల పంపిణీలో మరింత సంతృప్తి రావాలి. గ్రామాల్లో అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారు. బెస్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో ఇళ్లు నిర్మించాం. ఎన్నికష్టాలున్నా పీఆర్సీ వేశాం. హోమ్ గార్డులు, అంగన్ వాడీలు..ఇలా అందరికీ వేతనాలు పెంచామని అన్నారు. రాష్ట్ర స్థాయిలో వారికి సరైన దిశానిర్దేశం చేయాలి. మోటివేషన్, ఆర్గనైజేషన్ బాగుంది.  అఖిల భారత స్థాయిలో మన రాష్ట్ర అభివృద్ధికి గుర్తింపు వస్తోంది.  విద్యలో ముందున్నాం, హెల్త్ లో, ఐటీ, పంచాయతీరాజ్  లో,   గ్రామీణాభివృద్ధికి గుర్తింపుగా అవార్డులు వస్తున్నాయని అన్నారు.

No comments:
Write comments