న‌గ‌రంలో ప్రారంభ‌మైన ఉచితంమొక్క‌ల పంపిణీ

 

హైదరాబాద్ జూలై 17 (globelmedianews.com) 
హ‌రిత‌హారంలో భాగంగా న‌గ‌ర‌వాసుల‌కు ఉచితంగా మొక్క‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని జీహెచ్ఎంసీ ప్రారంభించింది. ప్ర‌స్తుత హ‌రిత‌హారంలో 40ల‌క్ష‌ల మొక్క‌ల‌ను నాటాల‌ని జీహెచ్ఎంసీ ల‌క్ష్యం నిర్ణ‌యించుకోగా, వీటిలో 35ల‌క్ష‌ల మొక్క‌ల‌ను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇప్ప‌టికే రెండు ల‌క్ష‌ల మొక్క‌ల‌ను వివిధ ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేసిన‌ట్టు క‌మిష‌న‌ర్ తెలిపారు. న‌గ‌రంలోని అన్ని పార్కులు, వార్డు కార్యాల‌యాల్లోనూ ఉచితంగా మొక్క‌లు పంపిణీ చేయ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు క‌మిష‌నర్ పేర్కొన్నారు. స్థానికంగా మొక్క‌లు పొంద‌డానికి వివిధ ప్రాంతాల్లోని న‌ర్స‌రీల వివ‌రాలను ప్ర‌క‌టించ‌డంతో పాటు ఆయా న‌ర్స‌రీల ఇన్‌చార్జీలను సంప్ర‌దించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలిపారు.
 
 
 
న‌గ‌రంలో ప్రారంభ‌మైన ఉచితంమొక్క‌ల పంపిణీ

No comments:
Write comments