ఫ్రాన్స్ ను మించిపోయిన భారత్

 

న్యూఢిల్లీ, జూలై 12 (globelmedianews.com)
మ‌న దేశం అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. వ‌ర‌ల్డ్ బ్యాంక్-2017 గ‌ణాంకాల ప్ర‌కారం ఫ్రాన్స్‌ను వెన‌క్కి నెట్టిన‌ భార‌త్ సంప‌ద విష‌యంలో ఆరో స్థానంలో నిలిచింది. పాశ్చాత్య దేశాల‌న్నీ రెండంకెల వృద్ధి రేటును అందుకునేందుకు ఆప‌సోపాలు ప‌డుతుంటే దానికి అడుగు దూరంలో భార‌త‌దేశం ఉంది. ఈ నేప‌థ్యంలో వ‌ర‌ల్డ్ బ్యాంకు గ‌ణాంకాలు భార‌తీయుల‌కు శుభ‌వార్త అందించింది. చివ‌ర‌కు భార‌త జీడీపీ 2.597 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంది. అదే స‌మ‌యంలో ఫ్రాన్స్ జీడీపీ 2.582 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. వ‌రుస‌గా చాలా త్రైమాసికాలు నెమ్మ‌దించిన భార‌త వృద్ధి రేటు జులై 2017లో బాగా పుంజుకుంది. 134 కోట్ల మందికి నిల‌య‌మైన భార‌త‌దేశం సంప‌ద విష‌యంలో అంత‌కంత‌కూ మెర‌గ‌వుతూ ఉంది. ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు, విదేశీ పెట్టుబ‌డుల వెల్లువ‌, దేశీయంగా ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి పెరిగిన కార‌ణంగా దేశ సంప‌ద బాగా పెరుగుతోంది. మ‌రో వైపు 6.70 కోట్లు మాత్ర‌మే జ‌నాభా క‌లిగిన ఫ్రాన్స్ ప‌ర్ క్యాపిటా ఇన్‌క‌మ్‌లో బాగానే ఉన్న‌ప్ప‌టికీ దేశ సంప‌ద విష‌యంలో మాత్రం నెమ్మ‌దిస్తోంది. జీ-7 దేశాల్లో ఒక‌టైన ఫ్రాన్స్ పారిశ్రామికీక‌ర‌ణ‌లో ముందంజ‌లో ఉంది.

ఫ్రాన్స్ ను మించిపోయిన భారత్ 

No comments:
Write comments