మోడీపై రాహూల్ ఎటాక్

 

న్యూఢిల్లీ, జూలై  21 (globelmedianews.com)
 లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చించిన ఏఐసీసీ అధ్యక్షుడు...ఇవాళ రెట్టించిన ఆత్మస్థైర్యంతో ప్రసంగించారు. ఏపీ ప్రత్యేక హోదాలో ఆంధ్రుల అన్యాయం, రాఫెల్ ఒప్పందం, ఉపాధి కల్పనలో  మోడీ సర్కారు పనితీరుపై విరుచుకపడ్డారు. చివర్లో ఆలింగనం చేసుకుని ప్రధానికీ ఝలక్ ఇచ్చారు. ఉలికపడటం మోడీ వంతైంది. అనంతరం కన్నుగీటిన ఘటన సభ్యులను అబ్బురపరిచింది. ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగంలో ఆవేదన, నవ్యాంధ్రుల ఆవేదన అర్థమైందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. 21వ శతాబ్దపు రాజకీయ ఆయుధానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బాధితులుగా మారారన్నారు. ప్రధాని అనే పదానికి యువకులు, దళితులు, బాధితులు అర్థం అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.  నల్లధనాన్ని అంతమొందిస్తామన్న ప్రధాని మోడీ, అర్థరాత్రి అకస్మాత్తుగా పెద్ద నోట్ల రద్దు చేసి...చిరువ్యాపారులను రోడ్డుపాల్జేశారన్నారు. యూపీఏ హయాంలో జీఎస్టీని వ్యతిరేకించినా బీజేపీ... దేశం నెత్తిన జీఎస్టీన రుద్దిందన్నారు. ఒక్కో భారతీయుడి ఖాతాలో జమ కావాల్సిన 15 లక్షల స్విస్ నగదు ఏమైంది నాలుగేళ్లు కావొస్తున్నా అతీగతిలేదన్నారు.  ఏడాదికి కోటి ఉద్యోగాలు కలిస్తామన్న ప్రధాని మోదీ హామీలన్ని... నీటి మూటలే అయ్యాయని విమర్శించారు. కేవలం 4 లక్షల మందికే ఉపాధి చూపారన్న రాహుల్... ఉద్యోగాలు అడిగితే పకోడీలు అమ్ముకోమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చాలని కోరినా పట్టించుకోలేదన్నారు. దేశానికి ప్రధానమంత్రిని కాదు.  

మోడీపై రాహూల్ ఎటాక్
కాపలాదారుగా ఉంటానని ఆర్భాటంగా ప్రకటించిన మోడీకి... అమిత్‌ షా కుమారుడు అవినీతికి కనిపించలేదాని ప్రశ్నించారు. యూపీయే హయాంలో 520 కోట్లున్న రాఫెల్‌ విమానం ఖరీదు ప్రధాని ఫ్రాన్స్ వెళ్లొచ్చా 1,600 కోట్లకు పెరిగిందన్నారు. ప్రధాని ఎవరితో కలిసి ఫ్రాన్స్ వెళ్లారో, ఏం మాట్లాడారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తానూ స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడిని కలిసి మాట్లాడానన్న రాహుల్... అలాంటి ఒప్పందేమేది జరగలేదని ఆయన చెప్పారన్నారు. రక్షణ మంత్రి నిర్మలసీతారామన్ ... ఈ దేశప్రజలకు అబద్ధాలు చెప్పారని ఆక్షేపించారు. ఈ సమయంలో సభలో గందరగోళం నెలకొంది.  రాహుల్‌ వ్యాఖ్యలపై రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా స్పందించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్‌ మాట్లాడుతూ.. స్పీకర్‌ అనుమతి లేకుండా సభలో ప్రభుత్వంపై ఆరోపణలు ఎలా చేస్తారని నిలదీశారు. సభలో ఆరోపణలు చేసే సమయంలో స్పష్టమైన ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.   ఎన్డీయే హయాంలో దేశంలో ఏ ఒక్కరికీ రక్షణ లేకుండాపోయిందని గళమెత్తారు. భారత దేశంలోని మహిళలకు రక్షణ లేని పరిస్థితి గురించి ప్రపంచంలో ప్రథమంగా చర్చ జరగడం సిగ్గుచేటన్నారు. ఈ దుస్థితి చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. మహిళలకు రక్షణలో ప్రపంచం మనల్ని చులకనగా చూస్తున్నా... ప్రధాని నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రాకపోవడం శోచనీయమన్నారు.దేశంలోని పది మంది పెద్ద వ్యాపారవేత్తలకు రెండున్నర లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేయించిన ప్రధాని మోడీకి రైతుల రుణాలు మాత్రం కనిపించడం లేదన్నారు. ప్రపంచమంతా పెట్రోల్‌ ధరలు తగ్గుతుంటే... మనదేశంలో మాత్రం పైపైకి పోతున్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్‌  నేరుగా ఆరోపణలు చేస్తోన్న సమయంలో‘ప్రధాని మోదీ పైకి నవ్వుతున్నా..లోలోపల ఆందోళన పడుతున్నారు. కానీ ఆయన కళ్లల్లోకి మాత్రం నేరుగా చూడలేకపోతున్నారన్నారు. ప్రసంగం తర్వాత ప్రధాని మోదీకి కరచాలనం చేసి, కౌగిలించుకుని ఝలకిచ్చారు. అవాక్కవడం మోడీ వంతైంది.

No comments:
Write comments