ఇక ఆన్‌లైన్ ద్వారా ఎంప్లాయ్ మెంట్ కార్డు రిజిస్ట్రేషన్

 

హైదరాబాద్ జూలై 13 (globelmedianews.com)  
నిరుద్యోగ యువత వ్యయ, ప్రయాసాలు పడుతున్న విషయాన్ని గుర్తించిన ఉపాధి కల్పన శాఖ దీనికి స్వస్థి పలికింది. సొంత ఊరిలోనే ఉంటూ ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని కార్డు పొందే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం కార్డు కావాల్సిన వారు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి మొదలు ఉన్నతాభ్యాసం చేసిన యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కల్పనకు సీనియారిటీ జాబితాను ఈ శాఖ నుంచే పంపించేవారు. దీనికిగాను నిరుద్యోగ యువత విద్యార్హతలను తెలియాజేస్తూ ఉపాధి కల్పన కార్డు పొందాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి స్వయంగా వెళ్లి దరఖాస్తు చేస్తే గానీ ఈ కార్డును పొందలేం. వెళ్లిన రోజు రద్దీగా ఉంటే మరో రోజు వెళ్లాల్సి వచ్చేది.ఏదైనా ధ్రువపత్రం లేకుంటే వెనక్కి రావాల్సిన పరిస్థితి. ఒకవేళ పని పూర్తయినా అప్పుడే కార్డు ఇచ్చేవారు కాదు. దీని కోసం మరోసారి వెళ్లక తప్పని పరిస్థితి. ఇంటి చిరునామా ఇస్తే వస్తుందో,రాదోనన్న అనుమానం. వీటన్నింటి మూలంగా కార్డు పొందడమే కష్టంగా అనిపించేది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి ఇది చాలా ఇబ్బందిగా ఉండేది. వీరికి సమయంతోపాటు డబ్బులు కూడా బాగా ఖర్చయ్యేవి. కార్డు పొందే వారిలో బాలికలు ఉంటే తోడుగా కుటుంబ సభ్యులు వెళ్లాల్సి వచ్చేది. ఇక ఈ ఇబ్బందులకు చెక్ పడనుంది.
రిజిస్ట్రేషన్ చేయడం ఎలా....
 
 
 
ఇక ఆన్‌లైన్ ద్వారా ఎంప్లాయ్ మెంట్ కార్డు రిజిస్ట్రేషన్
 
విద్యార్హత ధ్రువపత్రాలు సహా ఫొటో, సంతకం, ఆధార్‌కార్డును దరఖాస్తుతో జతచేయాల్సి ఉంటుంది. అభ్యర్థి సమర్పించిన వివరాలపై విచారించి 3,4రోజుల్లో కార్డు జారీ చేస్తారు. ఉద్యోగ ప్రకటనలు, వార్తలు , జాబ్‌మేళా వివరాలతో పాటు ఉద్యోగానికి అవసరమయ్యే సమాచారాన్ని రిజిస్టేషన్ నంబర్ సాయంతో ఎప్పిటికప్పుడు తెలుసుకునే అవకాశం ఈ విధానంలో ఉంటుంది.

No comments:
Write comments