అంతా గ్రాఫిక్సే : కిషన్ రెడ్డి

 

హైదరాబాద్,  జూలై 27, (globelmedianews.com)
పురపాలక శాఖ ప్రగతి నివేదిక ఇచ్చింది. హైదరాబాద్ లో కంప్యూటర్ గ్రాఫిక్స్ తప్ప .. సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్ రెడ్డి విమర్శించారు. జవాబుదారీ తనం తో పని చెయ్యాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. బీజేపీ డిమాండ్ తో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల తో సమావేశం రెండు సార్లు.. ఏర్పాటు చేశారు. గతం లో రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ హయం లో కూడా డీఆర్సీ మీటింగ్ రెగులర్ గా అయ్యేది. తెరాస వచ్చాక జిల్లా ఇంచార్జి మంత్రి లేడు, డీఆర్సీ మీటింగ్ లేదు.  మేము సచివాలయంలో ధర్నా చేస్తే సీఎం సమావేశం ఏర్పాటు చేశారని అయన అన్నారు. 
 
 
 
అంతా గ్రాఫిక్సే : కిషన్ రెడ్డి 
 
రాజభవన్ ముందు నీరు ఆగడం ఏంటని 2014 లో చెప్పిన సీఎం ఇంతవరకు స్పందించలేదు. డ్రైనేజీ వ్యవస్థ లేదు, తాగునీరు లేదు, ట్రాఫిక్ జామ్, కాలుష్యం , పార్క్ లు ఎండిపోతున్నాయి. మజ్లీస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర వందల కోట్ల అదనపు డబ్బు విడుదల చేసారు.. కానీ ఆ నిధులు ఎక్కడకు పోతున్నాయి.  పాత నగరం లో మెట్రో ట్రైన్ కోసం ఎందుకు ప్రగతి నివేదిక లో చెప్పలేదు. ట్యాంకుబండ్ లో కొబ్బరి నీళ్లు పోస్తాం అన్నారు..కానీసం ప్రయత్నం అయినా జరిగిందా అని ప్రశ్నించారు. ఆకాశాన్ని ముద్దాడే భారీ టవర్స్ ఏమైనాయి...అంతర్జాతీయ స్థాయి నగరం ఏమైంది.  ఎన్ని ఇండ్లు కట్టినా కేంద్రం సహకారం అందిస్తుంది. ట్విట్టర్, వాట్సాప్, మొబైల్ సేవలు అన్నారు ఎమ్మెల్యే గా చెప్పే సమస్య ల కే దిక్కు లేదు. ఒక కోటి మొక్కలు ఎక్కడ నాటారో.. చూపెట్టాలని అన్నారు. 
ఎమ్మెల్సీ  రాంచందర్రావు మాట్లాడుతూ  వంద రోజుల ప్రణాళిక ఏమైంది. డబుల్ బెడ్రూం లు ఏమైనాయి.  కేవలం గ్రాఫిక్స్ చూపించారని అన్నారు. ఇదంతా ఎన్నికల ముందు పబ్లిసిటీ మాత్రమే అబివృద్ది లేదని అన్నారు. 
ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ  నత్త నడక తో పనులు నడుస్తున్నాయి. గోదావరి నీళ్లు హైదరాబాద్ రావాలి.. అవెందుకు రావడం లేదని అన్నారు. మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీళ్లు  హైదరాబాద్ రావడం లేదు. మంచి నీళ్ళు, నాణ్యమైన రోడ్లు, వీధి దీపాలు, కేబుల్, సేవరెజ్  మీద మున్సిపల్ అధికారులకు అవగాహన లేదని అన్నారు. పంపారు..

No comments:
Write comments