ఆంధ్ర ప్రదేశ్ భవన్ వెబ్ సైట్ ను ప్రారంభం ప్రజలకు అవసరమైన సత్వర సేవలు కల్పన లక్ష్యం రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్

 

న్యూ ఢిల్లీ, 28 జులై, (globelmedianews.com)  
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి దేశ రాజధానికి విచ్చేసే ప్రజా ప్రతినిధులు, అధికార, అనధికారులు, ప్రజలకు అవసరమైన సత్వర సేవలు కల్పన లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ భవన్ సేవలను విస్తృత పరుస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు.  ప్రజలకు మెరుగైన సేవలు అందించే సంకల్పంతో నూతనంగా రూపొందించిన ఆంధ్ర ప్రదేశ్ భవన్ వెబ్ సైట్ 'apbhavan.in'  ను శుక్రవారం ఎపి భవన్ గురజాడ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్, అదనపు రెసిడెంట్ కమీషనర్ డా. ఆర్జా శ్రీకాంత్, అధికారులు, సిబ్బంది, మీడియా సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు.  
 
 
 
ఆంధ్ర ప్రదేశ్ భవన్ వెబ్ సైట్ ను ప్రారంభం
 ప్రజలకు అవసరమైన సత్వర సేవలు కల్పన లక్ష్యం
                రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీ కి విచ్చేసే వారికి ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం సాధారణ పరిపాలన విభాగం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ భవన్ న్యూ ఢిల్లీ లో వసతి కల్పిస్తున్నామని, ఈ సేవలను మరింత సరళతరం చేసేందుకు, ఇక్కడకు విచ్చేసేవారి సమయం వృధా కాకుండా సమయ పాలనతో నిర్ణీత సమయంలో సమీకృతసేవలు కల్పించే ఆశయంతో ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించామని చెప్పారు.  వెబ్ సైట్ సేవలను ప్రజాబాహుళ్యంలోనికి తీసుకు వెళ్లి విస్తృత ప్రచారం కల్పించుటకు అధికారులు సిబ్బందితోపాటు మీడియా ప్రధాన భూమిక పోషించ వలసిన ఆవశ్యకతను ఆర్సీ ప్రవీణ్ ప్రకాష్ విశదీకరించారు.ఢిల్లీకి విచ్చేసే వారు తమ ప్రయాణ తేదీ, వసతి వివరాల సమగ్ర సమాచారాన్ని ముందుగా వెబ్ సైట్ లో పొందుపరచాలని, అట్టి సమాచారాన్ని రాష్ట్ర సచివాలయ సాదారణ పరిపాలన విభాగానికి అనుసంధాన పరచి సకాలంలో వసతి, రవాణా సదుపాయం కల్పించి అట్టి వివరాలను ఎస్ ఎం ఎస్ ద్వారా ముందుగా సదరు అతిథికి తెలియ చేయనున్నట్లు చెప్పారు.  వెబ్ సైట్ వివరాలను ఇప్పటికే రాష్ట్ర సచివాలయ అధికారులకు వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులకు లేఖల ద్వారా తెలియచేయడం జరిగిందని ఆర్సీ ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు రెసిడెంట్ కమీషనర్ డా. ఆర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ సమగ్ర సేవల సమాచార భాండాగారంగా ఆంధ్ర ప్రదేశ్ భవన్ ను దశలవారీగా తీర్చిదిద్దుటకు ఆర్సీ ప్రవీణ్ ప్రకాష్ నేతృత్వంలో కార్యాచరణ ప్రణాలికను రూపొందించి అమలు చేయనున్నట్లు చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ జాయింట్ కమీషనర్, సూర్యనారాయణ, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

No comments:
Write comments