చంద్రబాబు ఇంటిముందు కూర్చుంటాం : పవన్ కళ్యాణ్

 

విజయవాడ, జూలై 28, (globelmedianews.com
అమరావతిని ఆపేస్తామని, రాజధానిని అడ్డుకుంటామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు తప్పు చేస్తున్నారని ఆయన అన్నారు. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ చూస్తూ ఊరుకోబోమని ఆయన చెప్పారు. భూదోపిడీపై న్యాయ, రాజకీయ, ప్రజా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. మనకి కనిపించే దేవుళ్ళు రైతులే. వారికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే వారు కరువయ్యారని అన్నారు. మహారాష్ట్ర తరహాలో రైతు ఉద్యమాలు చేస్తామని, అందరం వచ్చి సిఎం నివాం వద్ద కూర్చుంటామని ఆయన హెచ్చరించారు. కేసులు పెడితే ఎదురు తిరగండని, తాను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారులను, ప్రభుత్వ ఉద్యోగులలను తప్పు పట్టకుడదు.ఆదేశాలు ఇస్తున్న చంద్రబాబు , ఆయన ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి,నిందించాలని అన్నారు. గోదావరి జిల్లాల్లో త్రాగడానికి నీరు దొరకడం లేదు. 1970 లో తీసుకున్న భూముల్లో ఇప్పటికీ అభివృద్ధి ప్రారంభం కాలేదు. చంద్రబాబు లక్షల ఎకరాలను  తీసుకుంటున్నారు. ఎం చేసుకుంటారు ఇన్ని లక్షల  ఎకరాలని ప్రశ్నించారు. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు రైతుల  ఆవేదన చూసి సదస్సు పెట్టాను. మహిళా ఉద్యోగిని కొట్టిన ఎమ్మెల్యే పై రౌడీ షీట్ పెట్టలేదు. ప్రభుత్వం బెదిరించినా భయపడకుండా  రైతు తన భూమి లో సాగు చేసుకుంటుంటే  అతని మీద రౌడీ షీట్ పెట్టారు. చంద్రబాబు మీరు తప్పు చేస్తున్నారని పవన్ అన్నారు. మీరు రాజులు కాదు..ఇది రాజరికం కాదు. మీకు 5 ఏళ్ల అధికారం మాత్రమే ఇచ్చారు. తాను పాదయాత్ర చేస్తుంటే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు అలా పట్టనట్లు వ్యవహరించారని అనుకుంటున్నానని పవన్ చెప్పారు.
 
 
 
చంద్రబాబు ఇంటిముందు కూర్చుంటాం : పవన్ కళ్యాణ్
 

No comments:
Write comments