కర్నూలులో జేడీ లక్ష్మీనారాయణ

 

కర్నూలు, జులై10,  (globelmedianews.com)
కర్నూలు జిల్లాలో మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మాంటిసోరి పాఠశాలల్లోని విద్యార్థులతో లక్ష్మీనారాయణ మాట్లాడారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, మీరు చదువుకున్న స్కూళ్లో మీరే ముఖ్య అతిథిగా పాల్గొనే స్థాయికి ఎదగాలని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. 
అనంతరం ప్రభుత్వాసుపత్రిలో పర్యటించి రోగుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో నాలుగు రోజుల పర్యటన పర్యటించి రైతు, ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని అయన తెలిపారు. రాష్ట్రంలోని జిల్లాల పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
 
 
 
కర్నూలులో జేడీ లక్ష్మీనారాయణ

No comments:
Write comments