అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న కాంగ్రెస్ నేతలు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎంపీ గుత్తా

 

నల్లగొండ జూలై 17 (globelmedianews.com)
కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఉత్తమ్ తన భార్యను ఎమ్మెల్యేగా చేశారు. వాళ్లు కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కేసీఆర్, ఎంపీ కవిత,మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ప్రజల్లో నుంచి వచ్చారని ఉద్యమంలో పని చేశారని గుర్తు చేశారు.దేశం యావత్తూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు మాత్రం కళ్లున్న కబోదుళ్లా మాట్లాడుతున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భూమి లేని దళితులకు వెయ్యి ఎకరాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇంకా ఆంధ్రా నాయకత్వం విష కౌగిలిలో ఉన్నారు. సత్తా లేని,వెన్నుముక లేని నాయకులు పదవుల కోసం ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తారు. జానారెడ్డి ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటే హుందాతనంగా ఉంటుంది. కోమటిరెడ్డి లాంటి కోతమూకతో కలిసి జానా తిరగడం సబుబుగా లేదన్నారు.
 
 
 
అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న కాంగ్రెస్ నేతలు
    రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎంపీ గుత్తా
 

No comments:
Write comments