ఏటీఎంలతో జరాభద్రం

 

హైద్రాబాద్, జూలై 10 (globelmedianews.com)
నగదు ఉపసంహరించుకోవడానికి ఏటీఎంకు వెళతామా... ఒక్కోసారి ట్రాన్సాక్షన్‌ ఫెయిల్డ్‌ అని స్లిప్‌ వస్తుంది. ఇంతలోనే మనీ డెబిటెడ్‌ అని సెల్‌ఫోన్‌కి సందేశం అందుతుంది. ఈ సమస్య తప్పుడు పిన్‌ నంబర్‌ కొట్టినందువల్ల, ఏటీఎంలో నగదు కొరత వల్ల ఏర్పడవచ్చు..... సాంకేతిక కారణాల వల్లా సమస్య తలెత్తవచ్చు. మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి.. ఖాతాలోంచి వెళ్లిపోయిన నగదును తిరిగి ఎలా పొందాలి.మొదట అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. యంత్రం సరిగా పనిచేయక పోవడమా.. సమాచారం సరిగా నమోదు చేయడంలో పొరపాటు జరిగిందా... ఏటీఎంలో అసలు నగదు లేదా... 
 
 
 
ఏటీఎంలతో జరాభద్రం
 
ఇలా ప్రశ్నలు వేసుకోవాలి. సాధారణంగా ఏటీఎం సరిగా పనిచేయకపోయినప్పుడు సదరు బ్యాంకు ఆ సమస్యను గుర్తిస్తుంది. బాధితుల సమస్యను పరిష్కరిస్తుంది. ఒకవేళ అలా జరగని పక్షంలో మనం ఏం చేయాలి.... ముఖ్యంగా మనం లావాదేవీలకు సంబంధించిన స్లిప్పును భద్రంగా దాచుకోవాలి. అందులో ట్రాన్సాక్షన్‌ రిఫరెన్స్‌ నంబర్‌ ఉంటుంది.అన్ని బ్యాంకులు కస్టమర్‌ కేర్‌ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఖాతాదారులకు సహాయం చేసేందుకు బ్యాంకులు వీటిని ఏర్పాటు చేస్తాయి. ఒకసారి కస్టమర్‌ కేర్‌తో మాట్లాడి మన సమస్యను వివరిస్తే మీకు ఒక ట్రాకింగ్‌ నంబర్‌ ఇస్తారు. ఒకవేళ బ్యాంకు వైపున తప్పిదముంటే వారం రోజుల్లో మీ నగదును మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. కస్టమర్‌ కేర్‌తో మాట్లాడినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే మీ బ్యాంకుకు సంబంధించిన దగ్గర్లోని బ్రాంచికి వెళ్లండి.బ్రాంచిలో ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే సమస్యను మీరు ఖాతా కలిగి ఉన్న బ్రాంచి మేనేజర్‌ వద్దకు నేరుగా తీసుకెళ్లాలి. ప్రతి బ్యాంకులో గ్రీవెన్స్‌ సెల్‌ ఉంటుంది. ఇది మీ ఫిర్యాదుకు ప్రాముఖ్యతనిచ్చి పరిశీలిస్తుంది. ఈ ప్రక్రియ కోసం మీరు బ్యాక్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయాలి. అయినప్పటికీ మీకు న్యాయం జరగకపోతే. మీరు నేరుగా రిజర్వుబ్యాంకులోని అంబూడ్స్‌మన్‌ను కలవచ్చు. మీ ఫిర్యాదుని ఆన్‌లైన్‌ (ఆర్‌బీఐ వెబ్‌సైట్‌)లో గానీ రాతపూర్వకంగా గానీ ఇవ్వవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీరు ఫిర్యాదు చేసిన 30 రోజుల తర్వాత మాత్రమే మీరు బ్యాంకింగ్‌ అంబూడ్స్‌మన్‌తో మాట్లాడవచ్చు.
 
 
 

No comments:
Write comments