ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకూ ఇవ్వాల్సిందే: కడియం

 

న్యూఢిల్లీ జూలై 26, (globelmedianews.com)
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకూ ఇవ్వాల్సిందేనన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఏపీలో ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో చిత్త శుద్ధిలేదని విమర్శించారు. రాష్ట్రంలో కొత్త విద్యా సంస్థల ఏర్పాటుపై కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా లాభం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల అభివీద్ధి శాఖమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ను కలిసిన ఆయన విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీతో సహా పలు విద్యా సంస్థలపై త్వరితగతిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమ వినతులకు జావడేకర్‌ సానుకూలంగా స్పందించారని కడియం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకూ ఇవ్వాల్సిందే: కడియం

No comments:
Write comments