ధాయ్ పై హాలీవుడ్ మూవీ

 

ధాయ్ ల్యాండ్, జూలై 13  (globelmedianews.com)
12 మంది పిల్లలు, ఒక యంగ్ కోచ్.. భయానకమైన గుహలో చిక్కుకున్నారు. 9 రోజులు తిండి, నీరు లేక, ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రపంచమంతా కదిలింది. వారిని ఎలా తీసుకొచ్చారనేది కూడా అంతుచిక్కని విషయం. ఇది సరిపోదా.. ఒక సినిమా తీయాలంటే! ఈ అంశాన్ని బిగ్‌స్క్రీన్‌పై చూపించేందుకు ప్యూర్‌ ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సుమారు 60 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమైంది. ఈ విషయాన్ని నిర్మాతలు మైకెల్ స్కాట్, ఆడమ్ స్మిత్‌లు ప్రకటించారు. ఈ గొప్ప రెస్క్యూ చిత్రాన్ని.. ఆపరేషన్లో పాల్గొన్న వీరులకు, ప్రాణాలు కోల్పోయిన డైవర్‌ సమన్‌కు అంకితమిస్తామని తెలిపారు. లాస్‌ఏంజెల్స్‌కు చెందిన ఇవన్హోయె పిక్చర్స్ సంస్థ కూడా దీనిపై సినిమా తీసేందుకు సిద్ధమైంది. ఇది కోచ్ ఎక్కపొల్ చాంతవాంగ్‌ను లీడ్‌గా చేసుకుని తెరకెక్కించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ధాయ్ పై హాలీవుడ్ మూవీ

No comments:
Write comments