టెక్నాలజీతో మోసాలు చేసేస్తున్నారు

 

గుంటూరు,జూలై 28, (globelmedianews.com) 
కాదేదీ మోసానికి అనర్హం అంటున్నారు కేటుగాళ్లు. టెక్నాలజీతో ఎన్నో మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు.. ఇప్పుడు అదే సాంకేతికతను ఉపయోగించుకొని పేకాటలో కూడా జనాల నెత్తిన టోపీ పెడుతున్నారు. పేక ముక్కల్లో మైక్రో చిప్స్.. వాచ్‌లలో మైక్రో కెమెరాలు పెట్టి పేకాయట రాయుళ్ల నుంచి రూ.లక్షలకు లక్షలు దోచేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో బయటపడిన ఈ మోసాన్ని చూసి పోలీసులు షాకయ్యారు. ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి.. జనాల్ని ఎలా మోసం చేస్తున్నారో వారితోనే డెమో ఇప్పించారు. తెనాలి విద్యానగర్‌కు చెందిన వ్యక్తికి.. కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన మరో వ్యక్తితో పరిచయం పెరిగింది.
 
 
 
టెక్నాలజీతో మోసాలు చేసేస్తున్నారు
 
 ఇద్దరూ కలిసి రోజూ పేకాట కూడా ఆడేవారు. ఈ క్రమంలోనే మరో వ్యక్తి కూడా వీరిని కలిశాడు. ముగ్గురు కలిసి ఈజీ మనీ ఎలా వస్తుందా అని ఆలోచించారు. అప్పుడే సాంకేతిక పరిజ్ఞానంతో పేక ముక్కల్ని ఎలా స్కాన్ చేయొచ్చని తెలుసుకున్నారు. ఢిల్లీలో దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికాలు దొరుకుతాయని తెలుసుకొని.. వాటిని కొనుగోలు చేశారు. పేక ముక్కలతో పాటూ వాచ్‌లు, కరెన్సీ నోట్లలో కూడా మైక్రో చిప్స్‌ మోసాలు చేయడం ప్రారంభించారు. ఈ స్పెషల్ పేక ముకల్ని వీరే తయారు చేసేవాళ్లు. కార్డు చివర్లో ఈ చిప్‌ను అమర్చి.. టెక్నాలజీ సాయంతో ఎదుటవాళ్ల దగ్గరున్న పేక ముక్కల నెంబర్లు తెలుసుకునేవారు. దీని కోసం మొబైల్‌లో స్పెషల్ యాప్ కూడా తయారు చేసుకున్నారు. పేకలతో పాటూ వాచ్‌లు, కీ చైన్‌ల వంటి చిన్న, చిన్న వస్తువుల్లో కెమెరాలు కూడా అమర్చి మోసాలు చేసేవారు. ఇలా చాలామందిని బురిడీ కొట్టించారు. జనాల దగ్గర నుంచి డబ్బు కొట్టేయడంతో వీరు ఆగలేదు.. ఈ టెక్నాలజీని మరికొంతమందికి కూడా నేర్పించారట. ఈ ముఠా మోసాలకు చాలామంది అమాయకులు బలయ్యారు. రూ.లక్షల్లో మోసపోయారు. కొంతమంది ఆత్మహత్యాయత్నాలు కూడా చేశారట. పేకాటలో మోసపోయామని తెలిస్తే పరువుపోతుందని చాలామంది బాధితులు పోలీసులకు చెప్పేందుకు భయపడ్డారు. కాని కొంతమంది బాధితులు ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో మోసం బయపడింది. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేయగా.. మరొకర్ని త్వరలో అదుపులోకి తీసుకుంటామంటున్నారు. ఈ నిందితులే కాదు.. వీరికి ఎలక్ట్రానిక్ పరికరాలను అమ్మిన ఢిల్లీ ముఠా గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

No comments:
Write comments