జూనియర్ కాలేజీల మంత్రి నారాయణ

 

నెల్లూరు,  జూలై 6 (globelmedianews.com)
నెల్లూరులోని మునిసిపల్ జూనియర్ కాలేజీని మంత్రి నారాయణ సందర్శించారు.. అక్కడి విద్యార్దులతో  ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ అద్బుతమైన ఫలితాలు సాధించిందన్నారు.  ఆ స్ఫూర్తితో రాష్టమంతా మునిసిపల్ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.. నగరంలోని మున్సిపల్, జడ్పీ, ఎయిడెడ్ స్కూల్సలో చదువుతున్న దాదాపు 60 మంది విద్యార్దులకు  ఇక్కడ విద్యనభ్యసించే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.. వారికోసం మరో అదనపు గదిని సైతం ఏర్పాటు  చేయనున్నట్లు వెల్లడించారు. నెల్లూరును ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు క్రుషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
 
 
 
జూనియర్ కాలేజీల మంత్రి నారాయణ

No comments:
Write comments