ఇద్దరు సీఎంల వైఫల్యాలు వున్నాయి : పొంగులేటి

 

హైదరాబాద్,  జూలై 21, (globelmedianews.com) 
అవిశ్వాస తీర్మానం లో మోడీ స్పీచ్ 2019 ఎన్నికల ప్రచారంలా ఉంది.  కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ దేశం లో బీజేపీ వచ్చాకే అభివృద్ధి జరిగిందని  సొంత డబ్బా  కొట్టుకున్నారు . 2014 ఎన్నికలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మోడీ స్పీచ్ సినిమా స్క్రిప్ట్ ల ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.  రాహుల్ గాంధీ పరిణితి చెందిన నాయకుడిలా మోడీ ప్రభుత్వాని ఎండగట్టారు.  రాహుల్ కి కాదు. మోడీ  కి అహంకార భావం ఉంది. సీటు ఎక్కడ పోతుందో అని కనీసం మోడీ ప్రతిపక్ష ముఖ్య నేత వచ్చినా లేవలేదు. వాస్తవాలను రాహుల్ దేశ ప్రజల ముందు ఉంచారు. మోడీ పూర్తిగా బాధ్యతారహితంగా మాట్లాడారని అయన విమర్శించారు. తెలుగు తల్లి అంటూ మాట్లాడిన మోడీకి హిందీ తల్లి గుర్తురాలేదా. హిందీ రాష్ట్రాలు విడిపోయిన్నపుడు ఏమైంది . గల్ల జయదేవ్ విభజన గురించి మాట్లాడిన వ్యాఖ్యలను వెన్నక్కి  తీసుకోవాలి. విభజన చట్టం పై నేను కోర్ట్ కి వెళ్ళేవరకు టీడీపీ కి గుర్తురాలేదని అన్నారు. బీజేపీ తో ఇంటి ముందు కొట్లాట ...ఇంటివెనుక దోస్తానా అన్నట్లు టీఆరెస్ వైఖరి. చంద్రబాబు ,కేసీఆర్ లు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఏడూ మండలాల ఇష్యూ ముగిసిందని కేసీఆర్ అంటే ...ఏడూ మండ లను కలపాలని ఇప్పుడు మాట్లాడుతున్నరని అన్నారు. భద్రాచలం నియోజకవర్గం ఇష్యూ ,నాలుగు గ్రామాలను తిరిగి కలిపే అంశం ఈ వర్షాకాల సమావేశంలో క్లారిటీ ఇవ్వాలని అయన అన్నారు.

ఇద్దరు సీఎంల వైఫల్యాలు వున్నాయి :  పొంగులేటి 

No comments:
Write comments