ఉరే సరి ... సుప్రీమ్ కోర్టు

 

న్యూఢిల్లీ,జూలై 9,(globelmedianews.com)
నిర్భయ దోషులకు ఉరిశిక్ష సబబేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమకు వేసిన ఉరిశిక్షను రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చాలని దోషులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులోని ముగ్గురు దోషులకు ఉరిశిక్షను ఖాయం చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. ఢిల్లి హైకోర్టు సహా కింది కోర్టులు ఇచ్చిన తీరపును సుప్రీంకోర్టు సమర్ధించింది. మరణశిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కొట్టి వేసింది. మరణశిక్షే ఈ దోషులకు సరైనదంటూ సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ముఖేస్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్త అనే వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే 2013 జనవరి 23న ఒక నిందితుడిని మైనర్గా జువైనల్ బోర్డు తేల్చింది. కాగా ముగ్గురికి మరణశిక్ష విధించింది. నిందితులు క్షమించరాని నేరం చేశారని, ముఖేష్, పవన్, వినయ్ అనే ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు సుప్రీం తీర్పు వెలువరించింది. 2012 డిసెంబరు 16లో జరిగిన ఈ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, అత్యాచారాలపై కఠిన చట్టాలను తేవడానికి కారణమైన విషయం తెలిసిందే. తమకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ దోషులు రివ్యూ పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది.  
 
 
 
ఉరే సరి ... సుప్రీమ్ కోర్టు
 
న్యాయం జరిగింది. నిర్భయకు న్యాయం జరిగిందని ఆమె తల్లిదండ్రులు అన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తమకు సంతోషాన్నిచ్చిందని నిర్భయ తల్లిదండ్రులు అన్నారు

No comments:
Write comments