పవన్, జగన్ లమధ్య మాటల యుద్దం

 

హైద్రాబాద్, జూలై 26, (globelmedianews.com)
పవన్ కల్యాణ్ పై జగన్ వ్యాఖ్యలు రేపిన దుమారం అంతాఇంతా కాదు. ఇలాంటి కామెంట్స్ కు సత్వరమే తెర దించాలని అంతా ఆశిస్తున్నారు. లేదంటే.. భవిష్యత్ లో.. జగన్ స్ఫూర్తిగా.. పలువురు నేతలు.. పర్సనల్ అంశాలను ప్రచారవస్తువులుగా మార్చుకోవచ్చని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  రాజకీయ నేతలు ఆగ్రహావేశాలకు లోనవడం సర్వసాధారణమే. ప్రత్యర్ధి అనుకున్న నాయకుడి లోటుపాట్లు గమనించి.. వాటినే ప్రచారవస్తువులుగా మలచుకుంటారు. ఎన్నికల టైమ్ అయితే.. ఈ తరహా యాక్టివిటీ ఊపందుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే సాగుతోంది. టీడీపీ, వైసీపీ, జనసేనల నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఆయా పార్టీల అధినేతలూ.. ఈ ట్రాక్ లోనే ఉన్నారు. అయితే.. వీరి విమర్శల జోరు రాజకీయంగానే సాగింది. ఎక్కడా.. వ్యక్తిగత విషయాలకు వెళ్లిన సందర్భాలు లేవు. కానీ.. జగన్ మాత్రం.. ఫస్ట్ టైమ్.. పర్సనల్ ఇష్యూల జోలికెళ్లారు. 
 
 
 
పవన్, జగన్ లమధ్య మాటల యుద్దం
 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కామెంట్స్ కు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. బలమైన వ్యక్తిని కాబట్టే జగన్ తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని అన్నారు. మార్పుకోసం ప్రయత్నిస్తున్నాననే కోపంతో జగన్‌, బీజేపీ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని దోచుకున్న మీకే అంతుంటే నిజాయితీ పరుడినైన నాకెంత ఉండాలి., రాజ్యాంగం రాసింది చంద్రబాబు, జగన్‌ కాదంటూ పవన్‌కల్యాణ్‌ కామెంట్ చేశారు.పవన్ కల్యాణ్ ప్యూర్ పర్సనల్ ఇష్యూస్ ను జగన్.. ప్రస్తావించడంపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక జనసేన విషయానికొస్తే.. విపక్ష నేత తీరును ఎండగడుతోంది. జగన్ కు అసహనం పోవాలని సహనంతో ఉండాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. సంస్కారహీనంగా మాట్లాడకూడదన్న పవన్ కల్యాణ్ సూచనల మేరకు సంయమనంతో ఉన్నామని సంకుచిత ధోరణితో మాట్లాడే ప్రతిపక్షనేత ఉండడం బాధాకరమని అన్నారు. జగన్ ఒక అపరిపక్వమైన రాజకీయ నేత అంటూ ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు.. విమర్శలు చేయడం తప్పదు. కానీ.. వ్యక్తిగతంగా, కుటుంబ గురించి మాట్లాడడం మంచిది కాదని జనసేన నేతలు అంటున్నారు. వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించకూడదని జనసేన సిద్ధాంతాల్లో ఉందని తమ అధ్యక్షుడు జనసైనికులందరికీ సంస్కారం నేర్పించారని చెప్తున్నారు. వ్యక్తిగతంగా తాము ఎవరిపైనా విమర్శలు చేయమని అంటున్నారు.తాము సంయమనం పాటిస్తున్నామని జనసేన వర్గాలు చెప్తున్నా.. పవన్ అభిమానుల్లో మాత్రం జగన్ పై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. తూర్పుగోదావరిజిల్లాలో పవన్‌ అభిమానులు, ఆయన సామాజికవర్గ నేతల్లో దుమారమే రేగింది. పవన్‌ వ్యక్తిగత జీవితంపై జగన్‌ వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోకూడదంటూ స్థానిక జనసేన కార్యకర్తలు బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా నాయకుడు పవన్‌ కల్యాణ్‌ ఎపుడూ జగన్‌ వ్యక్తిగత జీవితం గురించి కామెంట్‌ చేయలేదు. అలాంటిది పవన్‌పై జగన్‌ ఇంత దారుణమైన కామెంట్స్‌ చేయడం సరికాదని అంటున్నారు. జగన్‌ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. మేం కూడా అదే బాటలో వెళ్తే ఆయన కుటుంబసభ్యులపైనా మాట్లాడాల్సి వస్తుందంటున్నారు జనసేన నేతలు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయకూడదనేది తమపార్టీ సిద్ధాంతమని మరోసారి పవన్‌పై ఇలాంటి కామెంట్స్‌ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్తున్నారు. జగన్‌ ఆర్థిక నేరాలు అందరికీ తెలిసినవే అని తెలియని వాటిని బయటపెట్టాలంటే జనసేన కార్యకర్తలకు పెద్ద పనేమీ కాదని అంటున్నారు.   పవన్ కల్యాణ్ ను రాజకీయం ఎదుర్కోలేకే.. జగన్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని జనసేన వర్గాలు అంటున్నాయి. ఈ పొలిటికల్ మాటల యుద్ధం ఎలా ఉన్నా.. సాధారణ జనాలు మాత్రం.. ఈ తరహా విమర్శలకు ఎంత త్వరగా చెక్ పడితే అంత మంచిదని భావిస్తున్నారు. లేకుంటే.. ప్రచారసభల్లో నేతల.. సంక్షేమ పథకాలకు బదులు.. వ్యక్తిగత బాగోతాలు వినే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు...

No comments:
Write comments