తెరాసది డబుల్ గేమ్ : వీహెచ్

 

హైదరాబాద్, జూలై 27, (globelmedianews.com)
40 వేల కోట్ల రూపాయల అవినీతి రఫెల్ యుద్దవిమానాల కొనుగోలు లో జరిగింది. బోఫోర్స్ కుంభకోణం లో 60 కోట్ల కుంభకోణం జరిగిందని గోరంతది కొండత చేసి బీజేపీ చూపించిందని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అన్నారు. శుక్రవారం నాడు అయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత బోఫోర్స్ కుంభకోణం పై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. రాజీవ్ గాంధీ ని  పార్లమెంట్ లో అవమానపరిచారు. ఒప్పంద వివరాలు రహస్యం గా  ఉంచాలని  ఫ్రాన్స్ ప్రభుత్వం చెప్పందని రక్షణ శాఖ మంత్రి చెప్పారు. సాంకేతిక అంశాలు సీక్రెట్ గా ఉంచొంచ్చు కాని ధర ఏంధుకు చెప్పకూడదు. అనుభవం లేని అనిల్ అంబానీ కంపెనీ కి ఏలాఇస్తారు. ఏన్డిఏ ప్రభుత్వం లో రఫెల్ అతిపెద్ద స్కాం. బీజేపీ చేసిన ఈ అవినీతి ని ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ప్రజలకు వివరిస్తారు..బీజేపీ ప్రభుత్వం ను నిలదీయడానికి ఇంతకంటె మంచి అవకాశం దొరకదని అన్నారు. బీజేపీ కుంభకోణాల ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న కేసీఆర్ సంగతిచూస్తాం. టీఆరెఎస్ ఏంపీలు  ఓటింగ్ లో పాల్గొనలేదంటేనే ఏపీ స్పెషల్ స్టేటస్ కు మద్దతిస్తున్నారని అయన అన్నారు. టీఆరెఏస్ ది డబుల్ గేమ్ అని విమర్శించారు.
 
 
 
తెరాసది డబుల్ గేమ్ : వీహెచ్ 

No comments:
Write comments