పట్టణ పేదల గృహసముదాయానికి శంకుస్థాపన

 

అనంతపురం, జూలై 11, (globelmedianews.com)
అనంతపురం జిల్లా  రాయదుర్గంలో నిర్మించనున్న పట్టణ పేదల గృహసముదాయానికి మంత్రి కాలవ శ్రీనివాసులు బుధవారం శంకుస్థాపన చేసారు. టిడ్కో ఆధ్వర్యంలో రూ.126 కోట్లతో 1791 ఇళ్ల నిర్మాణాలను షాపూర్జీ-పల్లోంజీ నిర్మాణ సంస్థ చేపట్టనుంది. మంత్రి మాట్లాడుతూ  అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీతో బహుళ అంతస్థుల్లో పట్టణ పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నాం, ఇళ్ల కాలనీలో మౌలిక వసతులకోసం ఒక్కో ఇంటిపై లక్ష రూపాయలు ఖర్చుచేస్తామన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాల్లో నిర్మించే ఇళ్లను కూడా పట్టణ ప్రాంత ఇళ్లనిర్మాణ పథకాన్ని వర్తింపచేస్తాం, ఇళ్ల నిర్మాణంలో అధునాతన టెక్నాలజీని వినియోగించి నాణ్యంగా ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు.  పేదలకు పెద్ద ఎత్తున జరుగుతున్న ఇళ్ల నిర్మాణాన్ని చూసి ఓర్వలేని విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు
 
 
 
పట్టణ పేదల గృహసముదాయానికి శంకుస్థాపన

No comments:
Write comments