రెండో మూవీపై దృష్టి పెట్టిన కళ్యాణ్

 

హైద్రాబాద్, జూలై 17 (globelmedianews.com) 
విజేత’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. మెగాస్టార్ అల్లుడిగా, మెగా ఫ్యామిలీ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా అల్లుడు తొలి చిత్రంతో హీరోగా నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కొడుకుగా ‘విజేత’ కావాలని ఆకాంక్షించాడు. అయితే ఈ తండ్రి కొడుకుల ‘విజేత’ కథలో కొడుకు కంటే ఎక్కువ మార్కులు తండ్రిగా చేసిన మురళీ శర్మకే పడ్డాయి. కళ్యాణ్ దేవ్ ఇంకా చాలా విషయాల్లో మెరుగుపడాల్సి ఉందనేది మెజార్టీ ఆడియన్స్ భావన. దీంతో ‘విజేత’ సినిమా మెగా హీరోలు ఎంత ఊదరకొట్టినా జస్ట్ యావరేజ్ మూవీగానే నిలిచింది. మొత్తంగా మెగా హీరో అనే తాపత్రయానికి పోకుండా కథా ప్రాధాన్యత ఉన్న చిత్రంలో నటించి.. హీరోయిజం కోసం వెంపర్లాడలేదు కళ్యాణ్ తేజ్. 
 
 
 
రెండో మూవీపై దృష్టి పెట్టిన కళ్యాణ్
 
ఇక ‘విజేత’ సినిమా సంగతి అటుంచితే.. తన రెండో సినిమాలో హీరోయిజంతో పాటు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఎలిమెంట్స్‌తో యాక్షన్ కమర్షియల్ మూవీకి మెగా కాంపౌండ్ ప్లాన్ చేస్తోందట. అందుకోసం యంగ్ కమర్షియల్ డైరెక్టర్, గబ్బర్ సింగ్ మూవీ దర్శకుడు హరీష్ శంకర్‌తో టచ్‌లో ఉన్నారట కళ్యాణ్ దేవ్. డీజే, గబ్బర్ సింగ్, మిరపకాయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన హరీష్ శంకర్ కళ్యాణ్ దేవ్ కోసం మాస్ మసాలా ఎంటర్ టైనర్‌ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ దర్శకుడు చేసిన ఆరు సినిమాల్లో నాలుగు హిట్స్ ఉంటే.. అందులో రవితేజ ‘మిరపకాయ్’ తప్ప మిగిలిన మూడు చిత్రాలు మెగా హీరోలు నటించినవే కావడంతో కళ్యాణ్ దేవ్‌కి హిట్ ఇచ్చే బాధ్యతను ఈ కమర్షియల్ దర్శకుడు భుజాలపై వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. మెగా అల్లుడుతో మూవీ చేసేందుకు హరీష్ శంకర్‌తో పాటు మరో యంగ్ దర్శకుడు కథతో రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు దర్శకుల్లో ఫైనల్ అయ్యేది ఎవరన్నది మెగాస్టార్ చేతుల్లోనే ఉంది. వచ్చే వారంలో కళ్యాణ్ తేజ్ అప్ కమింగ్ మూవీపై మెగా కాంపౌండ్‌ నుండి అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది.

No comments:
Write comments