సుశాంత్ "చి ల సౌ" సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సిరుని కార్పొరేషన్ అసోసియేట్!

 

 (globelmedianews.com)
సుశాంత్ నటించిన 'చి ల సౌ' సినిమాతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారారు. రుహాని శర్మ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. చి ల సౌ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, సిరుని సినీ కార్పొరేషన్ తో అనుబంధం ఏర్పరుచుకుంది. అన్నపూర్ణ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యనుంది.
ఇటీవల విడుదలైన చి ల సౌ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నటీనటులు: 
సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, జయ ప్రకాష్, సంజయ్ స్వరూప్, రోహిణి, అను హాసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్.
 
 
 
సుశాంత్ "చి ల సౌ" సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సిరుని కార్పొరేషన్ అసోసియేట్!

No comments:
Write comments