వాన కోసం ఎదురు చూపులు

 

తిరుపతి, జూలై 6, (globelmedianews.com)
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల గడుస్తున్నా.. వరుణుడు మాత్రం కరుణించడంలేదు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినా పెద్దగా ప్రభావం కనిపించడంలేదు. మొదట్లో ఊరించడంతో అన్నదాతలు పత్తి, కంది, వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. కానీ తర్వాత వరుణుడు మొండికేశాడు. 20 రోజులుగా వరుణుడి జాడలేకపోవడంతో భూమిలో వేసిన విత్తనం మొలకదశలోనే ఎండిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో వరుణుడి కరుణ కోసం అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. జిల్లాలో సాధారణ సాగు 6,34,280 హెక్టార్లు. ఇందులో ఎక్కువ భాగం వర్షంపై ఆధారపడి సాగయ్యే భూములే ఎక్కువగా ఉన్నాయి. రుతుపవనాలు సకాలంలో రావడంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల వాగులు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహించాయి. మురిసిన అన్నదాతలు ముందస్తు సాగుకు దిగారు. 
వాన కోసం ఎదురు చూపులు
వ్యవసాయాధికారుల అంచనా ప్రకారం జిల్లాలో 5 వేల హెక్టార్లలో వేరుశనగ, 4 వేల హెక్టార్లలో పత్తి, కంది, ఆముదం పంటలు సాగు చేశారు. కాగా గత 20 రోజులుగా వరుణుడి జాడకరు వైంది. పంటలు ఎండు ముఖం పడుతుండడంతో అన్నదాతలు వరుణుడి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 77.2 మి.మీ. కాగా.. 71.7 మి.మీ. వర్షం కురిసింది. ఏడు శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. అలాగే జూలైలో 117.2 మీ.మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 4వ తేదీ వరకు కేవలం 3.4 మీ.మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీంతో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.ఎండలు, ఉక్కపోత, ఈదురుగాలులు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాలు లేకపోవడంలో పాటు భారీ ఎండలు, గాలుల వల్ల భూమిలో తేమ శాతం ఆవిరి అవుతోంది. దీంతో వేసిన పంటలు మొత్తం ఎండుముఖం పడుతున్నాయి. అన్నదాతలు బ్యాంకుల ద్వారా, వడ్డీ వ్యాపారస్థుల ద్వారా అప్పులు తీసుకొని పొలాలు దున్నుకున్నారు. ముందస్తు వర్షాలు మురిపించడంతో రైతులు ఎకరాకు పత్తి విత్తనాలు మూడు ప్యాకెట్లు చొప్పున రూ.3 వేలు, ఎరువు బస్తా రూ.1200, కూలీ, దుక్కి ఇతర ఖర్చులు కలిపి మొత్తం ఎకరాకు రూ.10వేల వరకు ఖర్చు చేశారు. వేరుశనగకు ఇదే తరహాలో ఎకరాకు రూ.15 వేలకు పైగా ఖర్చు చేశారు. ముఖ్యంగా జిల్లాలోని పత్తికొం డ, ఆదోని, ఆలూరు పశ్చిమ ప్రాంతంలో రైతులు ఎక్కువగా పత్తి, వేరుశనగ, కంది, ఆముదం పంటలు సాగు చేశారు. కాగా వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. అన్నదాతలు పెట్టిన పెట్టుబడి వృథా అయ్యే ప్రమాదం దాపురించింది. దీం తో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

No comments:
Write comments