నేను మంచి కౌగిలింతలు, కన్ను కొట్టడం మిస్సాయ్యాను :కేటీఆర్

 

హైద్రాబాద్ జూలై 26 (globelmedianews.com) 
లోక్‌సభలో జరిగిన అవిశ్వాసంపై చర్చను దేశం మొత్తం ఆసక్తిగా చూసింది. ముఖ్యంగా టీడీపీ ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడంతో.. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా పరిణామాలను ఉదయం నుంచి రాత్రి వరకు గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణలో కూడా రాజకీయ నేతల మధ్య దీనిపైనే చర్చట. ఇంత సీరియస్ డిస్కషన్‌ను మంత్రి కేటీఆర్ మాత్రం మిస్సయ్యారట. తన బిజీ షెడ్యూల్‌లో పడి చర్చను చూడలేకపోయినట్లు ఉంది.. ట్విట్టర్ ద్వారా అవిశ్వాసంపై కాస్త ఆలస్యంగా స్పందించారు. తన ట్వీట్‌లో.. ‘చూడబోతే.. నేను మేజర్ డ్రామా లైవ్‌ను చూడటం మిస్సయ్యానేమో అనిపిస్తోంది. కౌగిలింతలు, కన్ను కొట్టడాలు, వాక్చాతుర్యాలు ఎక్స్‌ట్రా’ అంటూ స్మైలింగ్ ఎమోజీని పెట్టారు. మరో ట్వీట్‌లో అవిశ్వాసం సందర్భంగా లోక్‌సభలో టీఆర్ఎస్ తరపున మాట్లాడిన ఎంపీ వినోద్‌ను కూడా అభినందించారు. ‘కరీంనగర్ ఎంపీ వినోద్ గారికి నా అభినందనలు.. తెలంగాణ ప్రజలకు కేంద్రం చేసిన అన్యాయం, నెరవేర్చని హామీలపై బాగా హైలెట్ చేశారు. వెల్ డన్ సార్’అంటూ ప్రశంసలు కురిపించారు. శుక్రవారం లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో టీఆర్ఎస్ కూడా తమ వాదనను వినిపించింది. ఆ పార్టీ తరపున ఎంపీ వినోద్.. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని.. విభజన చట్టంలో అమలు కాని హామీలపై నిలదీశారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ప్రాజెక్టులకు నిధులు, హైకోర్టు విభజన సహా అన్ని అంశాలను ప్రస్తావించారు. నేను మంచి కౌగిలింతలు, కన్ను కొట్టడం మిస్సాయ్యాను :కేటీఆర్

No comments:
Write comments