విశాఖలో జనసేన కార్యాలయం

 

విశాఖపట్నం, జూలై 03,(globelmedianews.com)
విశాఖలో జనసేన పార్టీకి కేరాఫ్ అడ్రస్ దోరికింది.ప్రజల సమస్యలపై గళమెత్తుతున్న పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఉత్తరాంద్రకు సంబంధించిన నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి నూతన కార్యాలయం వేదిక కావాలని ఆకాంక్షించారు. ‘‘ అన్ని వనరులు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణం. దీనికి కారణాలను అన్వేషించడంతోపాటు ఈ ప్రాంత సమస్యలకు పరిష్కారాలు సూచించి, అభివృద్ధికి బాటలు వేసేందుకు ఈ కార్యాలయం వేదిక కావాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రంలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశమై చర్చలు నిర్వహించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున తరలి వచ్చిన అభిమానులు పవన్ కు ఘన స్వాగతం పలికారు. ప్రజల సమస్యలపై ఉద్యమిస్తున్న పవన్ కళ్యాణ్ విశాఖలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటుతో మరింత ప్రజల్లోకి వెళ్లేందుకు మార్గం సుగగమైందని భావిస్తున్నారు.

విశాఖలో జనసేన  కార్యాలయం 

No comments:
Write comments