సిల్వర్ స్క్రీన్ పై మరో నాలుగు సినిమాలు

 

హైద్రాబాద్, జూలై 18 (globelmedianews.com)
ఈవారం కూడా బాక్సాఫీస్ ముందుకు తమ అదృష్టం పరీక్షించుకోవడానికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు సినిమాలు రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే రాజ్ తరుణ్ తో దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న లవర్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని రెడీగా వుంది. అనీష్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న రెండో సినిమా ఇది.అంతా కొత్తవాళ్లే నటించిన పరిచయం సినిమా కూడా 21న విడుదలకు రెడీ అయింది. ఈ సినిమాకు పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అండగా వుండడం విశేషం. నైజాంలో ఆసియన్ సునీల్, సీడెడ్ లో ఎన్వీప్రసాద్ ఈ చిన్న సినిమాను పంపిణీ చేస్తున్నారు.
మంచి దర్శకుడిగా పేరున్న చంద్ర సిద్దార్ధ అందిస్తున్న సినిమా ఆటగదరాశివ. చావబోయేవాడు, చంపబోయేవాడు కలిసి ట్రావెల్ చేయడం పిలాసిఫికల్ థాట్ తో తయారైన సినిమా ఇది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.ఈ మూడు సినిమాలకు తోడు మంచులక్ష్మి హీరోయిన్ గా పీపుల్స్ మీడియా నిర్మించిన వైపాఫ్ రామ్ కూడా ఈవారమే విడుదలవుతోంది. ఇప్పటికే థియేటర్లలో హిట్ అయినవి, కానివి చాలా సినిమాలు వున్నాయి. ఇప్పుడు వీటికి మరో నాలుగు సినిమాలు తోడవుతాయి.
 
 
 
సిల్వర్ స్క్రీన్ పై మరో నాలుగు సినిమాలు

No comments:
Write comments