సమరానికి సై

 

రంగారెడ్డి, జూలై 7 (globelmedianews.com) 
గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా.. లేక అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్తారా అన్న అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఎక్కడ నలుగురు కలిసినా ఇదే చర్చ. గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు పూర్తిచేసి రిజర్వేషన్లు ప్రకటించే సమయంలోనే బీసీలలో వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు చేపట్టేలా చూడాలని హైకోర్టు ఆదేశించింది. దీంతోపాటు నాలు గు వారాల పాటు గడువు విధించింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి ప్రక్రియా ప్రారంభించకపోవడంతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడినట్లే కనిపిస్తున్నాయి. మరోవైపు సీఎం ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు.
 
 
 
  సమరానికి సై
 
కేంద్రం కూడా ఆ దిశగానే అడుగులేస్తోంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే అసెంబ్లీ, పార్లమెంట్‌కు ముందస్తుగా వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న చర్చ సాగు తోంది. చాలామంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ ఎన్నికలవైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగు తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు పంచాయతీ ఎన్ని కలు పెడితే గెలిచే బాధ్యత తీసుకోవడంతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులు గ్రామాల్లో సర్పంచ్‌ టికెట్లు ఆశించి భంగపడ్డ వారు అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలుంటాయని, ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. గ్రామాలలోని స్థానిక నాయకులు కూడా కొన్నాళ్లపాటు పంచాయతీ ఎన్నిక లు వాయిదా పడితేనే బాగుంటుందని భావిస్తున్నారు. అధికార, విపక్ష ఎమ్మెల్యేలు పంచాయతీ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బాగుంటుం దన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో సర్పం చులుగా, వార్డు సభ్యులుగా ఎన్నికల బరిలో దిగేందుకు చాలా మంది సిద్ధమయ్యారు. అయితే, హైకోర్టు ప్రకటనతో వారంతా నిరాశచెందారు. ప్రస్తుతం బీసీ కమిషన్‌ ద్వారా బీసీల గణనను చేపట్టాల్సి వసుస్తండటం మూలంగా సమయం పట్టే అవకాశముంది. వికారాబాద్‌ జిల్లాలో 250పైగా కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. ఇందులో తండాలు, అనుబంధ గ్రామాలున్నాయి. వీటిలో పోటీకి సిద్ధమైన వారంతా నిరాశ చెందారు. పంచాయతీ ఎన్నికలు గడువులోగా జరగకపోతే ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ప్రత్యేకాధికారుల పాలనా, పర్సన్‌ ఇన్‌చార్జీల నియమాకమా అన్నదానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ప్రభుత్వం ఇంకా ఈ అంశాలపై దృష్టి సారించడం లేదన్న విషయాన్ని అధికారులు చెబుతున్నారు. దాదాపుగా ఎన్నికలు వాయిదా పడినట్లేనని అధికారులు చెబుతున్నారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామపంచాయతీ ఎన్నికలు వాయిదా పడినపుడు ప్రత్యేకాధికారులతో పాలన రెండేళ్లపాటు కొనసాగింది. ప్రస్తుతం మళ్లీ అదే పరిస్థితి వస్తుందేమోనని పంచాయతీల్లో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.

No comments:
Write comments