కాంగ్రెస్ లోకి ఉండవల్లి

 

రాజమండ్రి, జూలై 7, (globelmedianews.com)
సీనియర్‌ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, గాంధీ కుటుంబ విధేయుడు. అప్పటి ఇందిరా గాంధీ నుంచి, రాహుల్ గాంధీ దాకా, అందరితో సన్నిహితంగా ఉండేవారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు కాంగ్రెస్‌లో ఎంపీలుగా పదవులు నిర్వహించి.. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీకి దూరమైన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఫోకస్‌ పెట్టింది. కాంగ్రెస్‌ పార్టీకి అంతటి కీలకమైన నేత కావడంతో ఉండవల్లిని తిరిగి కాంగ్రె‌స్‌లోకి రావాలంటూ ఆహ్వానం పంపారు. రాష్ట్ర విభజన తర్వాత ఉండవల్లి కాంగ్రె‌స్‌ను సైతం తూర్పారబట్టారు. ఆ పార్టీకి రాజీనామా చేసి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీలో చేరినా, ఎన్నికలలో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు.
 
 
 
 కాంగ్రెస్ లోకి ఉండవల్లి
 
తర్వాత వైసీపీలో చేరతారని ఉండవల్లి అనుచరవర్గం భావించింది. అయితే ఇప్పటికీ అరుణ్‌కుమార్‌ జగన్‌ పార్టీలో చేరలేదు. కానీ ప్రతి ప్రెస్ మీట్ లో, జగన్ కు అనుకూలంగా మాట్లాడుతూ, చంద్రబాబుని విమర్శిస్తూ ఉంటారు. ప్రతి సందర్భంలో, నేను ఇంకా రాజకీయాల్లోకి రాను, ఏ పార్టీలోకి వెళ్ళను, కాని రాజకీయాలు మాట్లాడతూ అని చెప్తూ ఉంటారు. అయితే, కాంగ్రెస్ పార్టీ కోమాలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో, పాత నేతలు అందరినీ, తిరిగి సొంత గూటికి ఆహ్వానిస్తున్నారు.ఇందులో భాగంగా, ఉండవల్లిని కూడా తిరిగి పార్టీలోకి ఆహ్వానించటానికి, కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.వచ్చే ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్‌ క్రియాశీల పాత్ర పోషిస్తుందన్న అంచనాలు వేసుకుంటున్నారు. ఎన్డీయేకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న కూటమికి మద్దతు ఇవ్వడమా? ఎక్కువ సీట్లు వస్తే వారి మద్దతు కూడగట్టుకోవడమా? అనేదానిపై కాంగ్రెస్‌ సీరియ్‌సగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభావం లేకపోయినా, కేంద్రంలో క్రియాశీలకంగా ఉంటుందన్న అంచనాలతో పాత నేతలు కాంగ్రె్‌సలోకి తిరిగి వస్తారని నమ్మకంగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రభావంలేకపోయినా కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం వస్తే కాంగ్రె్‌సలో ముఖ్య నాయకులకు ఏవేవో పదవులు పొందవచ్చన్న అభిప్రాయంలో కూడా పలువురు నేతలు దృష్టిసారిస్తున్నట్లు చెప్తున్నారు

No comments:
Write comments