తెలంగాణలో కాకా రేపుతున్న రాజకీయాలు

 

హైద్రాబాద్, జూలై 7 (globelmedianews.com)
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. నిన్నమొన్నటివరకు సైలెంట్ గా ఉన్న పార్టీలు  టీఆర్ఎస్ బీజేపీ.. మాటల యుద్ధానికి దిగాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చేసిన... హాట్ కామెంట్స్ ఇందుకు కారణం. తెలంగాణ పాలిటిక్స్ అంతలా హీటెక్కించిన రాంమాధవ్ చేసిన ఘాటు వ్యాఖ్యలేంటి? దానిపై గులాబీ నేతలు స్పందన ఎలా ఉంది ? తెలంగాణలో కమలం వర్సెస్ గులాబీ ఫైట్ మొదలయ్యిందా ? తెలంగాణ ఆడబిడ్డలపై బెదింరింపులకు దిగుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మగతనం లేదంటూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

 తెలంగాణలో కాకా రేపుతున్న రాజకీయాలు
అధికారం కోసం వాళ్లు ఎంతకైనా తెగిస్తారని అన్నారు. ఇందుకు బెల్లంపల్లి మున్సిపాలిటీ వ్యవవహారంలో స్థానిక ఎమ్మెల్యే వ్యవహరించిన తీరే నిదర్శనమన్నారు. ఓ కౌన్సిలర్‌ కూతురుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు బాగోలేదని, అతడి బెదిరింపులకు పాపం ఆ ఆడకూతురు భయపడుతూ మాట్లాడిన తీరు తనను ఎంతగానో కలచి వేసిందన్నారు. బిజెపి జనచైతన్య యాత్రలో భాగంగా వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన బహిరంగ సభలో  రాంమాధవ్ టీఆర్ఎస్ సర్కార్ పై కామెంట్స్ చేశారు. రాంమాధవ్ చేసిన హాట్ కామెంట్స్ తో  టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది.టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మగతనం లేదన్న  రాంమాదవ్ వ్యాఖ్యలపై గులాబీ టీం తీవ్రంగా స్పందిస్తుంది. బీజేపీ ఎమ్మెల్యేల మగతనం ఏపాటిదో గతంలో జరిగిన ఎన్నికల్లోనే తేలిపోయిందన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.  సంఘ్‌లో పనిచేశానని చెప్పుకునే రాంమాధవ్ మాట్లాడాల్సిన భాష ఇదేనా? అని ప్రశ్నించారు. టీఆర్‌పై రాంమాధవ్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు జీవన్ రెడ్డి.మొత్తం మీద రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలో తెలంగాణ రాజకీయాల్లో కాక రేపాయి. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాంమాధవ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం... ఆయన అలా మాట్లాడాల్సి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ... రాంమాధవ్ వ్యాఖ్యలు మత్రం గులాబీ వర్గంలో గుబులు పుట్టిస్తున్నాయనేది రాజకీయ విశ్లేషకులు మాట.

No comments:
Write comments