రాం మాధవ్ వ్యాఖ్యాలను ఖండిస్తున్నాం : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

 

హైదరాబాద్, జూలై 6, (globelmedianews.com)
బీజేపీ నేతలు ఏం మాట్లాడాలో తెలియక  జన చైతన్య యాత్రలో సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. అమలా పురం లో రాం మాధవ్ తెరాస ఎమ్మెల్యేల మగతనం గురించి మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.  తెలంగాణ విడిచి వెళ్ళేకముందే రామ్ మాధవ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. బీజేపీ భారతీయ సంస్కృతిని పరిరక్షించే పార్టీ యా కించపరిచే పార్టీ యా ? సంఘ్ లో పనిచేశానని చెప్పుకునే రాం మాధవ్ మాట్లాడాల్సిన భాష ఇదేనా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు చెబుతున్న అబద్ధాలకు ఆ పార్టీ ని కచ్చితంగా బడా జూటా పార్టీ అనాల్సిందే. కమలం పువ్వు తెలంగాణ లో ఎపుడో వాడిపోయింది. బీజేపీ , తెరాస ల్లో దేనికెంతో విలువ ఉందో ఉప ఎన్నికల్లో రెండు పార్టీల విజయాల ను పోల్చుకుంటే సరిపోతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చనిపోతే వచ్చిన ఎన్నికల్లో కూడా తెరాస గెలిచింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ లు చనిపోతే వచ్చిన ఎన్నికల్లో కూడా బీజేపీ దారుణంగా ఓడిపోయింది. మా సీఎం కెసిఆర్ ఖాళీ చేసిన మెదక్ ఎంపీ సీటులో తెరాస అఖండ విజయం సాధించింది. యూపీ లో సీఎం ,డిప్యూటీ సీఎం లు ఖాళీ చేసిన ఎంపీ సీట్లలో బీజేపీ ఓడిపోయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది. అవినీతి నిర్మూలన గురించి బీజేపీ మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించడమే. మంత్రి కేటీఆర్ మీద రాం మాధవ్ చేసిన అవినీతి ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. బీజేపీ కి తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెప్పేందుకు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ లో అన్నీ ఉపఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ నేతలు నోరు పెంచి మాట్లాడినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు ఆరోపణలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
 
 
 
రాం మాధవ్ వ్యాఖ్యాలను  ఖండిస్తున్నాం : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

No comments:
Write comments