పవన్ సత్యమేవ జయతి కాన్సెప్ట్ షో

 

హైద్రాబాద్, జూలై 24 (globelmedianews.com)  
పవన్ కల్యాణ్ త్వరలోనే బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఓ నేషనల్ న్యూస్ ఛానెల్‌లో సామాజిక సమస్యలపై వచ్చే ప్రోగ్రాంలో ఆయన పాల్గొననున్నారు. అమీర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’ తరహాలో ఈ ప్రోగ్రాం ఉండనుంది. ఈ కార్యక్రమాన్ని వారంలో రెండుసార్లు టెలికాస్ట్ చేయనున్నారు. ఈ ప్రోగ్రాం థీమ్, స్క్రిప్ట్ కోసం పవన్ కల్యాణ్ టీం కసరత్తు చేస్తోంది. మరి కొద్ది వారాల్లో ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది. విద్య, ఆరోగ్యంపై ఈ ప్రోగ్రాం ఆరంభంలో ఫోకస్ చేయనున్నారు. ఈ ప్రోగ్రాం అరగంట సేపు ప్రసారం అవుతుందన్న ప్రచారం నడుస్తున్నప్పటికీ నిడివి విషయం స్పష్టంగా తెలియదని జనసేన నేతలు తెలిపారు. ఈ ప్రోగ్రాంను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసారం చేస్తారని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
 
 
 
పవన్ సత్యమేవ జయతి కాన్సెప్ట్ షో

No comments:
Write comments